తెలంగాణ సీఎం కేసీఆర్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 11:18 AM

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ

తెలంగాణ సీఎం కేసీఆర్.... ఉద్యం నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు. రాజకీయం చేయాలన్నా... రాజ్యాన్ని కాపాడాలన్న ఆయనకు ఆయనే సాటి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. అందుకే కరోనా విషయంలో కూడా కేసీఆర్ బలంగా ముందుకు పోతున్నారు. ప్రజలే ప్రాణాలే తమ ప్రభుత్వానికి ముఖ్యమంటూ... కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే తెలంగాణలో కేసీఆర్ లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత.... ఇతర రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సొంత ఊరికి వెళ్లలేక... ఇక్కడ పనిలేక పూటగడవని పరిస్థితిలో పడిపోయారు. మరోవైపు హాస్టల్‌లో చదువుకున్న విద్యార్థులు కూడా హాస్టల్స్ ఖాళీ చేయాలని నిర్వాహకులు చెప్పడంతో ఎటూ వెళ్లలేని ఆందోళనలో పడిపోయారు. ఈ ఘటనపై కేసీఆర్ స్పందించిన తీరు... అందరి చేత శభాష్ అనిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కేసీఆర్‌పై సెలబ్రిటీల నుంచి సామాన్యులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ విలక్షణ నటుడు సోనూ సూద్ కేసీఆర్ ‌పై ట్వీట్ చేశాడు. ట్రూ లీడర్ ( నిజమైన నాయకుడు) అంటూ కొనియాడాడు. ఇక ఆ తర్వాత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల సైతం గులాబీ బాస్ పై ప్రశంసలు కురిపించింది. తెలంగాణ సీఎంది గ్రేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని కొనియాడింది. ఇలాంటి సమయంలో ఇలాంటి వాళ్ల లీడర్ షిప్ మనకు అవసరం అంటూ ట్వీట్ చేసింది. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా కేసీఆర్ వలస కూలీలు, ఇతరరాష్ట్రీయులపై చూపిస్తున్న ఔదార్యానికి హ్యాట్సాఫ్ అంటున్నారు. మీలాంటి వారి నాయకత్వం ఉన్న రాష్ట్రంలో మేం చాలా సుఖంగా సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆదివారం ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల ప్రజలపై గులాబీ బాస్ చూపిస్తున్న శ్రద్ధకు అంతా ఫిదా అవుతున్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్... ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. వాళ్లంత మా బంధవులు, సోదరులు, పిల్లల్లాంటివాళ్లు అన్నారు సీఎం. మీకు మంచి నీళ్ల నుంచి మందులు వరకు అన్నీ సమకూర్చడం మా బాధ్యత అన్నారు. మీరంతా మా రాష్ట్రానికి సేవ చేయడానికి మా రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి వచ్చిన వాళ్లన్నారు. మీరు సొంతూళ్లకు వెళ్లడానికి టెన్షన్ పడొద్దన్నరు. మీకెలాలంటి అవసరం వచ్చినా మేం అండగా ఉంటున్నారు. కుటుంబలో ప్రతీ మనిషికి 12 కిలోల బియ్యం ఇస్తామన్నారు. ప్రతీ కుటుంబానికి 2000 అందిస్తామని హామీ ఇచ్చారు. మూడున్నర లక్షలమందికి చెందిన మా లిస్ట్ మా దగ్గర ఉందన్నారు. మీకు ఎలాంటి అవసరం అయినా... స్థానికంగా ఉన్న నేతల్ని అధికారుల్ని కలవాలన్నారు. మీరు ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా తెలంగాణలో ఉండాలన్నారు.


Untitled Document
Advertisements