కరోనా ఎఫెక్ట్: 20 మంది అమ్మాయిలతో థాయ్ రాజు క్వారంటైన్

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 12:06 PM

కరోనా ఎఫెక్ట్: 20 మంది అమ్మాయిలతో థాయ్ రాజు క్వారంటైన్

కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో ఇప్పటివరకు 7.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 34,781 మంది ప్రాణాలు విడిచారు. అయితే, ఇప్పటికీ ప్రజల్లో ఈ వైరస్‌పై పెద్దగా ఆందోళన కనిపించడం లేదు. సాధారణ జీవితాన్ని గడిపేందుకే ఇష్టపడుతున్నారు. ఇళ్లల్లో ఉండకుండా బయట తిరుగుతున్నారు. వారి కుటుంబికుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇండియాలో ఇప్పటికే కొన్ని లక్షల మంది విదేశాల నుంచి ప్రజలతో కలిశారు. దీనివల్ల ఇప్పుడిప్పుడే తీవ్రత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లో ఉండటం చాలా అవసరమని ప్రభుత్వం చెబుతోంది. విదేశాల నుంచి వచ్చినవారు సెల్ఫ్ క్వారంటైన్‌లోనే ఉండాలని, బంధువులు, స్నేహితులను కలవరాదని ఆదేశిస్తున్నారు. ఇక థాయ్‌లాండ్‌లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అయితే, కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన రాజు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. స్వదేశాన్ని విడిచి విదేశాల్లో విలాసాలు చేస్తున్నాడు. థాయ్‌లాండ్‌కు చెందిన 67 ఏళ్ల రాజు మహా వాజిరాలోంగ్కోర్న్.. జర్మనీలోని గర్మిస్చ్-పార్టెన్కిర్చెన్‌‌కు వెళ్లాడు. అక్కడ అల్పైన్ రిసార్ట్ టౌన్‌లోని సొన్నెన్‌బిచ్ల్ గ్రాండ్ హోటల్ మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా స్వయంగా ఐసోలేషన్ ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఐసోలేషన్‌లో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఉండాలి. వారు వృద్ధులైతే ఒకరు లేదా ఇద్దరు నిబంధనలు పాటిస్తూ వారికి సేవలు చేయవచ్చు. అయితే థాయ్ రాజు మాత్రం.. ఐసోలేషన్‌లో కూడా విలాసవంతంగా గడుపుతున్నాడు. 20 మంది అమ్మాయిలు, పనివాళ్లతో కలిసి హోటల్‌లో జల్సాలు చేస్తున్నాడు. థాయ్ రాజుకు నలుగురు భార్యలు ఉన్నారు. అయితే, అతడు భార్యలతోనే కలిసి ఉంటున్నాడా లేదా అమ్మాయిలతో కలిసి ఉంటున్నాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ హోటల్‌లోకి ఎవరికీ ప్రవేశం లేదు. దీంతో లోపల ఏం జరుగుతుందనేది బయట ప్రపంచానికి కూడా తెలీదు. కరోనా వైరస్ నేపథ్యంలో జర్మనీలో అని హోటళ్లను బంద్ చేసింది. అయితే, థాయ్ రాజు ఉంటున్న సొన్నెన్‌బిచ్ల్ హోటల్ మాత్రమే తెరిచి ఉంది. దీనిపై హోటల్ యాజమాన్యం స్పందిస్తూ.. ‘‘వారంతా విదేశీయులు పైగా, ఒకే దేశానికి చెందిన బృందం. వీరిలో ఎవరూ బయట వ్యక్తులు లేరు. పైగా అందరూ సింగిల్స్. ఒకొక్కరికీ ఒక గది మాత్రమే ఇచ్చాం. అంతా విడివిడిగానే ఉంటున్నారు’’ అని సమాధానం చెప్పారు. రాజు వాజిరాలోంగ్కోర్న్ సుమారు 139 మంది సభ్యులతో వచ్చినట్లు సమాచారం. వీరిలో సుమారు 119 మందిలో కరోనా వైరస్ లక్షణాలు ఉండటంతో తిరిగి థాయ్‌లాండ్ పంపేశారు. వైరస్ లక్షణాలు లేకుండా ఆరోగ్యం ఉన్నవారిని మాత్రమే హోటల్‌లో ఉంచారు. అయితే, రాజు జల్సాలపై థాయ్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాచరికాన్ని అవమానించే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇందుకు సుమారు 15 ఏళ్లు జైలు శిక్ష తప్పదని అంటున్నారు.





Untitled Document
Advertisements