కరోనా కట్టడికి మిథాలీ రాజ్ రూ. 10 లక్షలు విరాళం

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 12:36 PM

కరోనా కట్టడికి మిథాలీ రాజ్ రూ. 10 లక్షలు విరాళం

దేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం భారత మహిళా వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించింది. ఇందులో రూ. 5 లక్షలు పీఎం-కేర్స్ ఫండ్‌కి ఇవ్వనున్నట్లు ప్రకటించిన మిథాలీ.. మిగిలిన రూ. 5 లక్షలు తెలంగాణ సీఎం రిలీఫ్ పండ్‌కి కేటాయించింది. భారత్‌లో మంగళవారం ఉదయానికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,347కి చేరింది. భారత క్రికెటర్లు గత మూడు రోజుల నుంచి కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి వరుసగా విరాళాలు అందిస్తున్నారు. సురేశ్ రైనా అత్యధికంగా రూ. 52 లక్షలు ప్రకటించగా.. సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు, అజింక్య రహానె రూ. 10 లక్షలు అధికారికంగా ప్రకటించారు. ఇక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకి పంచి ఇస్తున్నాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన భార్య అనుష్క శర్మతో కలిసి సోమవారం విరాళం ప్రకటించాడు. కానీ.. ధోనీ రూ. 1 లక్ష విరాళంపై పెద్ద ఎత్తున దుమారం రేగిన నేపథ్యంలో.. కోహ్లీ దంపతులు తాము ఇచ్చిన విరాళం అమౌంట్‌ని రహస్యంగా ఉంచారు. అయితే.. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం విరుష్క జోడి రూ. 3 కోట్లు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. భారత మహిళా క్రికెటర్లలో స్పిన్నర్ పూనమ్ యాదవ్ రూ. 2 లక్షలు విరాళం ఇవ్వగా.. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రూ. 1.5 లక్షలు ఇచ్చింది.





Untitled Document
Advertisements