80 లక్షలు ఇచ్చిన రోహిత్ శర్మ

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 01:22 PM

కరోనాపై పోరాటానికి క్రీడాకారులు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజలను చైతన్య పరచడమే కాకుండా... తమ వంతుగా ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తున్నారు. తాజాగా టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కరోనాపై యుద్ధానికి రూ. 80 లక్షల విరాళాన్ని ఇచ్చాడు. ఇందులో ప్రధాని సహాయ నిధికి రూ. 45 లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు ఇచ్చాడు. దీంతోపాటు జొమాటో ఫీడింగ్ ఇండియాకు రూ. 5 లక్షలు, వీధి కుక్కల సంరక్షణ కోసం మరో రూ. 5 లక్షల విరాళం ఇచ్చాడు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆహారం దొరకని అభాగ్యులకు జొమాటో సంస్థ ఆహారాన్ని అందిస్తుండటం గమనార్హం.

ఈ సందర్భంగా రోహిత్ శర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, 'మన దేశం మళ్లీ సాధారణ స్థితికి రావాలి. ఇందులో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. నా వంతు ప్రయత్నాన్ని నేను చేశా. మన నేతల వెనుక నిలుద్దాం. ఈ విపత్తు సమయంలో ప్రధాని, ముఖ్యమంత్రికి అండగా ఉందాం' అని పిలుపునిచ్చాడు.





Untitled Document
Advertisements