"అకిరా మీకు హీరో కావొచ్చేమో..కాని వాడు నా కొడుకు"

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 02:03 PM


వదినా మా నెక్స్ట్ హీరో, జూనియర్ పవర్ స్టార్ అకిరానందన్‌ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ వీరాభిమాని రేణూ దేశాయ్ లైవ్ చాట్‌లో సలహా ఇవ్వగా ఎప్పటిలాగే దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది పవన్ మాజీ భార్య రేణు దేశాయ్. ‘అన్నా.. అకిరా మీకు హీరో కావొచ్చేమో.. వాడు నా కొడుకు. మీ కంటే కూడా నా ప్రాణం వాడు. ఒక తల్లికి అలా చెప్పకూడదు.. వాడు హీరో అయితేనే జాగ్రత్తగా చూసుకుంటాం అని కాదు.. వాడిని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత’ అంటూ నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చారు రేణు దేశాయ్. ఇక ఒక్కసారి అకిరాని చూపించండి వదినా అంటే.. వాడికి చాలా సిగ్గు. నా ఇన్ స్టాగ్రామ్‌కి రాడు. అందుకే వాడి ఫొటో కూడా పెట్టడం లేదు’ అని సమాధానం ఇచ్చింది. ఇక ‘అలవైకుంఠపురములో’ సాంగ్స్ విన్నారా? అంటే.. యా.. సూపర్బ్ సాంగ్స్.. అన్నీ పాటలు విన్నాను. అందులోని సామజవరగమన సాంగ్ అకిరా ఎన్నిసార్లు విన్నాడో.. వాడి వల్ల నేను ఎన్నిసార్లు విన్నానో. అద్భుతమైన సాంగ్ అది’ అని అన్నారు రేణు. ఇక మరో నెటిజన్ లైవ్‌లోకి వచ్చి రేణు దేశాయ్ పాపులర్ హిట్ సాంగ్‌ ‘చిగురాకు చాటు చిలకా’ అనే పాట పాడమనగా.. ఆ పాటను గుర్తుతెచ్చుకునేందుకు నానా ఇబ్బందులు పడింది రేణు. ఆ పాట నాకు తెలుసుకాని.. అది గుర్తురావడం లేదు.. ఏ పాట ఇది అంటూ మూడు పదాలు చెప్పి పాట పాడమని అనొద్దు. పూర్తి పాట చెప్తే గుర్తుకు వస్తుందని’ సరదాగా ఇన్ స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు రేణు దేశాయ్.





Untitled Document
Advertisements