కరోనా: 22 లక్షల మందికి డెత్ విష్

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 02:26 PM

కరోనా: 22 లక్షల మందికి డెత్ విష్

అమెరికాలో భీకరంగా వ్యాపిస్తూ రెండున్నర వేల మందిని పొట్టనపెట్టుకుంటున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నిజానికి దేశంలో కరోనా మహమ్మారి వల్ల 22 లక్షల మంది చనిపోతారని అంచనాలు ఉన్నాయన్నారు. తాను చేపట్టిన చర్యల వల్ల కరోనా ఒకటి నుంచి రెండు లక్షల మందే చనిపోవచ్చని వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ అధికారులు డాక్టర్ డెబోరా బిక్స్, డాకర్ ఆంథోనీ ఫాసీ వేసిన అంచనాలు చెబుతున్నాయని, ఇదే జరిగితే తాము బాగా పనిచేసినట్లేనని ఆయన ఆదివారం
మీడియాతో చెప్పారు. దేశంలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్‌ను పొడిగించినట్లు ట్రంప్ ప్రకటించారు. దేశంలో కరోనా మరో 2 వారాల్లో పీక్ స్టేజ్ కు చేరుకుంటుందని, అప్పుడు మరణాల రేటు మరింతగా పెరుగుతుందన్నారు. లాక్ డౌన్ పొడిగింపుతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడినట్లు అవుతుందన్నారు. ఏప్రిల్ 12న ఈస్టర్ పండుగ నాటికి సంక్షోభం ముగుస్తుందని తాను భావించానని, కానీ చావుల మధ్య పండుగ ముగియనుందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాటికి దేశంలో 1,43,025 మందికి వైరస్ సోకింది. 2,509 మంది చనిపోయారు. 4,500 మందే కోలుకున్నారు. ఒక్క న్యూయార్క్‌‌‌‌లోనే 33,768 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. మరణాలు వెయ్యి దాటాయి. న్యూజెర్సీలో కేసులు 13 వేలకు చేరగా 161 మంది చనిపోయారు. వాషింగ్టన్ లో 4896 కేసులు నమోదు కాగా 204 మంది చనిపోయారు. అమెరికాలో వెయ్యికి పైగా చొప్పున కేసులు నమోదైన రాష్ట్రాలు 20 కంటే ఎక్కువే ఉన్నాయి. 24 రాష్ట్రాల్లో ట్రంప్ సర్కారు ప్రకటించిన నేషనల్ ఎమర్జెన్సీకి అదనంగా డిజాస్టర్‌‌‌‌గా డిక్లేర్ చేశారు. న్యూయార్క్ లో సోషల్ డిస్టెన్స్ రూల్స్ పాటించనివాళ్లకు 200 నుంచి 400 డాలర్లవరకూ ఫైన్లు వేస్తున్నారు. కరోనా ధాటికి న్యూయార్క్‌‌‌‌లో గంటగంటకూ పదులకొద్దీ జనం చనిపోతున్నారు. దీంతో హాస్పిటళ్లలో మార్చురీలకు కొరత ఏర్పడుతోంది. దాదాపు ప్రతి హాస్పిటల్ దగ్గరా భారీ ఫ్రిజ్‌‌‌‌లు ఉన్న ట్రక్కులను నిలిపి తాత్కాలిక మార్చురీలుగా వాడుతున్నారు. ఒక్కో ట్రక్కులో 44 డెడ్ బాడీలకే స్థలం ఉంటుండటంతో శవాలను భద్రపర్చడం కష్టమవుతోందని అధికారులు చెప్తున్నారు. ప్రపంచంలోనే అమెరికాలో బెస్ట్ హెల్త్ కేర్ సిస్టం ఉందని అంటున్నా, కరోనా విపత్తుకారణంగా తీవ్ర సంక్షోభం ఏర్పడిందని చెప్తున్నారు. సాకర్ స్టేడియాలు, కన్వెన్సన్ సెంటర్లు, హార్స్రేస్ ట్రాకులను కూడా తాత్కాలిక హాస్పిటళ్లుగా మారుస్తున్నారు. అమెరికాలో ఇండియన్ అమెరికన్లకు సాయం చేసేందుకు పలు ఇండియన్ అమెరికన్ సంఘాలు ప్రత్యేక హెల్ప్ లైన్ ప్రారంభించాయి. సేవా ఇంటర్నేషనల్ సంస్థ ఇండియన్ల సాయం కోసం 2.50 లక్షల డాలర్లనిధులు సేకరించింది. ఈ నిధులతో మాస్క్లు, మందులు, ఇతర వస్తువులను కొని పంపిణీ చేస్తున్నారు. సీరియస్‌‌‌‌గా ఉన్నకొవిడ్ పేషెంట్లకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌‌‌ను ఇచ్చేందుకు ఎఫ్డీఏ అనుమతించించడంతో న్యూయార్క్లో 1,100 మందికి
ఈ మందుతో ట్రీట్‌‌‌‌మెంట్ చేస్తున్నారు.





Untitled Document
Advertisements