ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్షల కోట్ల నష్టం...'భారత్‌ సేఫ్'!

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 03:36 PM

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్షల కోట్ల నష్టం...'భారత్‌ సేఫ్'!

చైనా వూహాన్‌లో పుట్టిన ప్రాణాంతక వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఈ వైరస్ దెబ్బకు అనేక దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అంతేకాదు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు సైతం ఛిన్నాభిన్నం అయిపోయాయి. ఆరోగ్య, ఆర్థిక సంకోభం కలిస్తే.. ఫలితాలు ఎంత దారుణంగా వుంటాయో ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా ప్రత్యక్షంగా చూస్తోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని అంచనా వేస్తుంది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ఆర్థిక మాంద్యంలోకి జారుకోనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కోవిడ్‌-19 సృష్టించిన విలయానికి ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో అపూర్వమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నందున ఈ ముప్పు ఏర్పడనుందని తెలిపింది. ఈ సంక్షోభం నుంచి ప్రపంచ దేశాలను ఆదుకోవడానికి 2.5 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీ అవసరముంటుందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి (యుఎన్‌సిటిఎడి) కాన్ఫరెన్స్‌ పేర్కొంది. అదే విధంగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ అప్పులో సగం రద్దు చేసిన మాదిరిగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశాలకు ఆర్థిక వ్యవస్థలకు రుణాలను రద్దు చేయాలని కూడా కోరింది. లేకుంటే గణనీయంగా తగ్గించాలని పేర్కొంది. దీంతో పాటు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా ఆరోగ్య సంక్షోభం ముదరనుందని తెలిపింది. ఆరోగ్యం సంక్షోభం వస్తే, ఈ దేశాలు మరింత ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతాయని అంచనావేసింది. కాబట్టి ఆయా దేశాలలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, సేవలను బలోపేతం చేసే మార్గాలను అన్వేషించాలని పేర్కొంది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పోల్చితే, కరోనా కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆర్థిక సంక్షోభం భారీగా తాకనుందని యుఎన్‌సిటిఎడి తెలిపింది. ప్రపంచ ఆర్ధికవ్యవస్థ ఈ ఏడాది ట్రిలియన్ డాలర్లలో ప్రపంచ ఆదాయాన్ని కోల్పోతుందని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలకు కరోనా షాక్ పేరుతో ఐక్య రాజ్య సమితి ట్రేడ్ రిపోర్ట్ విడుదల చేసింది. అయితే ఆర్థిక మాంద్యంలో విషయంలో మాత్రం భారత్ సేఫ్ అంది. సంక్షోభంలో జారుకునే ప్రమాదం భారత్‌తో పాటు చైనాలకు మాత్రం ఉండకపోవచ్చని యుఎన్‌సిటిఎడి పేర్కొంది. అదే సమయంలో ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాత్రం లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని తెలిపింది.






Untitled Document
Advertisements