ఆసియాక‌ప్‌పై పీసీబీ క్లారిటీ...!

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 03:56 PM

ఆసియాక‌ప్‌పై పీసీబీ క్లారిటీ...!

ప్ర‌తిష్టాత్మ‌క ఆసియా క‌ప్ నిర్వ‌హ‌ణ‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా స్పందించింది. క‌రోనా వైర‌స్ వేళ ఆసియాక‌ప్‌ను వాయిదా వేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ ఈ టోర్నీపై స్ప‌ష్ట‌త‌నిచ్చింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఈ టోర్నీపై నిర్ణ‌యిస్తుంద‌ని, అంత‌కుముందు స‌భ్య‌దేశాలతో క‌లిసి స‌మావేశ నిర్వ‌హిస్తుంద‌ని పేర్కొంది. నిజానికి ఈ టోర్నీ ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నుంచి పాకిస్థాన్‌లో జ‌ర‌గాల్సి ఉంది. అయితే భ‌ద్ర‌తా కార‌ణాల‌తో భార‌త జ‌ట్టు ఇక్క‌డ ఆడేందుకు విముఖత చూప‌డంతో, టోర్నీ వేదిక‌ను మార్చేందుకు పీసీబీ అంగీక‌రించింది. అయితే టోర్నీ తాజా వేదిక‌ను నిర్ణ‌యం, ఏసీసీ స‌మావేశంలో జ‌రుగుతుంద‌ని పీసీబీ చీఫ్ ఎహ‌సాన్ మ‌ణి తెలిపారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో స‌మావేశం తేదీ నిర్ణ‌యించ‌లేద‌ని, వైర‌స్ సంక్షోభం స‌ద్దుమ‌ణిగాక మీటింగ్‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని తెలిపారు. మ‌రోవైపు టోర్నీ నిర్వ‌హించ‌డానికి చాలా స‌మ‌యముంద‌ని, ఏప్రిల్ నెలాఖ‌రుక‌ల్లా టోర్నీపై నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగ‌నున్న‌క్ర‌మంలో ఈ టోర్నీని టీ20 ప‌ద్ద‌తిలో నిర్వ‌హిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. నిజానికి 2016లో మెగాటోర్నీకి ముందు కూడా ఆసియాక‌ప్‌ను పొట్టి ఫార్మాట్‌లోనే నిర్వ‌హించారు. అయితే 2018లో మాత్రం వ‌న్డే ప‌ద్ధతిలో జ‌రిపారు. ఈ రెండుసార్లు ఫైన‌ల్లో బంగ్లాదేశ్‌ను ఓడించిన ఇండియా విజేత‌గా నిలిచింది.





Untitled Document
Advertisements