ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం...మారనున్న ట్యాక్స్ రూల్స్

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 04:03 PM

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం...మారనున్న ట్యాక్స్ రూల్స్

ఏప్రిల్ 1 అంటే రేపటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతోంది. ఈసారి దేశం మొత్తం లాక్ డౌన్‌లో ఉన్న సమయంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమౌతుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ట్యాక్స్ సంబంధిత డెడ్‌లైన్స్‌ను పొడిగించింది. అయితే కొన్ని ట్యాక్స్ రూల్స్ మాత్రం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. అవేంటో చూద్దాం.

ఆర్థిక సంవత్సరం పొడిగింపుపై కొంత ఆందోళన నెలకొంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. ఆర్థిక సంవత్సరాన్ని పొడిగించలేదని స్పష్టం చేసింది. దీంతో కొత్త ట్యాక్స్ రూల్స్ ఏప్రిల్ 1 నుంచే అమలులోకి రానున్నాయి. మోదీ సర్కార్ బడ్జెట్ 2020లో కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ట్యాక్స్ సిస్టమ్ అమలులోకి వస్తుందని పేర్కొంది. దీంతో ఉఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చెల్లింపు విధానం అమలులోకి వస్తుంది. ఇది ఆప్షన్ మాత్రమే. ఇష్టం ఉన్న వారు దీన్ని ఫాలో కావొచ్చు. లేదంటే పాత విధానాన్నే అనుసరించొచ్చు. అయితే దీని మీద కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. అలాగే ఏప్రిల్ 1 నుంచి డివిడెంట్ ట్యా్క్స్ అమలులోకి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లేదా కంపెనీలు కస్టమర్లకు అందించే డివిడెంట్లపై ఇప్పుడు కస్టమర్లే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పన్ను చెల్లింపుదారులపై భారం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 1 నుంచి పొందే డివిడెండ్స్ ఆదాయానికి వచ్చి జతవుతాయి. దీనికి అనుగుణంగా మీ ట్యాక్స్ స్లాబ్, పన్ను రేట్లు మారతాయి. లోన్ తీసుకొని ఇంటిని కొనుగోలు చేయని వారి కోసం బడ్జెట్ 2020లో తీపికబురు ఉంది. బడ్జెట్‌లో అందుబాటు ధరలోని ఇంటి కొనుగోలుకు హోమ్ లోన్ తీసుకుంటే సెక్షన్ 80ఈఈఏ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. వడ్డీ మొత్తంపై రూ.1.5 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది. 2021 మార్చి 31 వరకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. అలాగే అధిక వేతనం కలిగిన వారు ఏడాదిలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌) కంట్రిబ్యూషన్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్), సూపరాన్యుటేషన్ ఫండ్ వంటి వాటిల్లో కంపెనీ కంట్రిబ్యూషన్ రూ.7.5 లక్షలు దాటితే పన్ను చెల్లించాల్సి రావొచ్చు.





Untitled Document
Advertisements