తెలంగాణ నుంచి ఢిల్లీ ప్రార్థనలకు 1030 మంది...వారందరికీ కరోనా పాజిటివ్?!

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 06:18 PM

తెలంగాణ నుంచి ఢిల్లీ ప్రార్థనలకు 1030 మంది...వారందరికీ కరోనా పాజిటివ్?!

దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మర్కజ్ భవన్‌లో జరిగిన మత కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక్కడ జరిగిన జమిత్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే ఎక్కువగా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగించే అంశం. తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 1030 మంది ఈ కార్యక్రమానికి హాజరైనట్లు ప్రభుత్వం గుర్తించింది. యుద్ధ ప్రాతిపదికన వీరందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. దగ్గు, జ్వరం లాంటి లక్షణాలున్న వారి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరు ఎవరెవరిని కలిశారనే అంశంపైనా దృష్టి సారించారు.

ఒక్క హైదరాబాద్‌ నగరం నుంచే మొత్తం 603 మంది మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత నిజామాబాద్ నుంచి 80 మంది, నల్గొండ నుంచి 45 మంది, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి 38 మంది, ఆదిలాబాద్ నుంచి 30 మంది ఢిల్లీ కార్యక్రమానికి హాజరయ్యారు.

కామారెడ్డి, నారాయణపేట్ జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పలువురు ఢిల్లీ మస్కజ్ ప్రార్థనలకు హాజరైనట్లు అధికారులు ఇప్పటివరకు గుర్తించారు. ఆయా జిల్లాల వైద్యాధికారులతో ట్రాకింగ్ చేస్తున్నారు. ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ట్రాకింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని అధికారులు గుర్తించి పరీక్షలు చేస్తున్నారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులు, డాక్టర్ల బృందంతో ట్రాకింగ్ చేస్తున్నారు.

జిల్లాలవారీగా మస్కజ్ ప్రార్థనలకు వెళ్లి వారి వివరాలు
*హైదరాబాద్ - 603
*అదిలాబాద్ - 30
*కొత్తగూడం - 11
*జగిత్యాల - 25
*జనగామ - 4
*భూపాల్‌పల్లి - 1
*గద్వాల్ - 5
*కరీంనగర్ - 17
*ఖమ్మం - 27
*మహబూబాబాద్ -6
*మహబూబ్‌నగర్ - 11
*మంచిర్యాల - 10
*మెదక్ - 2
*మేడ్చల్ - 2
*ములుగు - 2
*నాగర్‌కర్నూల్ - 4
*నల్గొండ - 45
*నిర్మల్ - 25
*నిజామాబాద్ - 80
*పెద్దపల్లి - 6
*రాజన్న సిరిసిల్ల - 9
*రంగారెడ్డి - 13
*సంగారెడ్డి - 22
*సూర్యాపేట - 10
*వికారాబాద్ - 13
*వనపర్తి - 3
*వరంగల్ రూరల్ - 1
*వరంగల్ అర్బన్ - 38
*యాదాద్రి - 4.





Untitled Document
Advertisements