కరోనా కట్టడికి రామోజీ గ్రూప్స్ రూ.20 కోట్ల విరాళం

     Written by : smtv Desk | Wed, Apr 01, 2020, 11:36 AM

కరోనా కట్టడికి  రామోజీ గ్రూప్స్ రూ.20 కోట్ల విరాళం

కరోనా కష్టకాలంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు దాతలు. సినిమా సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు, పలు సంస్థలు ఈ విపత్కర సమయంలో అండగా ఉన్నామంటూ ప్రజలు, ప్రభుత్వాలకు భరోసా ఇస్తున్నారు. తాజాగా రామోజీ గ్రూప్స్ కూడా కరోనాపై పోరు కోసం తెలుగు రాష్ట్రాలకు రూ.10 కోట్ల చొప్పున.. మొత్తం రూ.20 కోట్ల విరాళం అందించారు. ఈ సాయాన్ని రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధి ఖాతాలకు బదిలీ చేశారు. అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ సంస్థ ఛైర్మన్ రామోజీరావు లేఖలు కూడా రాశారు. కరోనాపై యుద్ధంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించినందుకు రామోజీ గ్రూప్స్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టే సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఈ విరాళం ఉపయోగపడుతుందని.. కరోనా వంట సంక్షోభ సమయంలో మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.





Untitled Document
Advertisements