కరోనా కట్టడి కోసం ఏకంగా రూ. 1,125 కోట్లు

     Written by : smtv Desk | Wed, Apr 01, 2020, 04:14 PM

మన దేశంపై పంజా విసిరిన కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి పలు కార్పొరేట్ కంపెనీలు భారీ విరాళాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత శ్రీమంతుల్లో ఒకరైన అజీమ్ ప్రేమ్ జీకి చెందిన విప్రో, అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ కరోనా కట్టడి కోసం ఏకంగా రూ. 1,125 కోట్లను కేటాయించాయి.

కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా సేవలందిస్తున్న వైద్య, సేవా సిబ్బందికి సాయ పడేందుకు ఈ మొత్తాన్ని కేటాయించారు. దీనికి తోడు క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో చర్యలు, బాధితులకు సహాయాన్ని అందజేయడం, వైద్య సదుపాయాల అభివృద్ధి, బాధితులకు చికిత్స, కరోనా నియంత్రణ కోసం నిధులను వెచ్చించనున్నారు. ఈ కార్యక్రమాల అమలు కోసం సంబంధిత శాఖల సహకారం తీసుకోనున్నారు. ఈ కార్యక్రమం కోసం అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ కు చెందిన 1,600 మంది వైద్య బృందం, 350 మందికి పైగా పౌర సమాజ భాగస్వాములు సమన్వయంతో పని చేస్తారు.





Untitled Document
Advertisements