ఏప్రిల్ 14 మూడో షిఫ్టు వరకూ సింగరేణి కార్మికులకు లేఆఫ్

     Written by : smtv Desk | Wed, Apr 01, 2020, 06:47 PM

ఏప్రిల్ 14 మూడో షిఫ్టు వరకూ సింగరేణి కార్మికులకు లేఆఫ్

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున సింగరేణి తమ కార్మికులకు లేఆఫ్ ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. ఏప్రిల్ 1న రెండో షిఫ్టు నుంచి అత్యవసర సేవల సిబ్బంది, ఓపెన్ కాస్ట్ గనులు సహా, కొండాపూర్ గనులు మినహా మిగతా భూగర్భ గనులు మొత్తం మూసివేస్తున్నట్లుగా సింగరేణి గనుల చీఫ్ ఇన్స్‌పెక్టర్ ప్రకటించారు. ఈ లేఆఫ్ ఏప్రిల్ 14 మూడో షిఫ్టు వరకూ అమలులో ఉంటున్నట్లుగా వివరించారు.


అండర్‌ గ్రౌండ్‌ గనుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని లేఆఫ్‌ అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులు సామాజిక దూరం పాటించలేని పరిస్థితులు లేవని యాజమాన్యం వివరించింది.



మెషిన్‌ మైనింగ్‌ ఉన్న వీకే-7, శాంతి ఖని, జీడేకే-11ఏ ఇంక్లైన్‌, కొండాపూరం భూగర్భ గనులతో పాటు, అన్ని ఉపరితల గనులను యథావిథిగా పని చేస్తాయని వివరించింది. మూసివేసిన గనుల్లో కూడా అవసరమైన విభాగాలకు చెందిన వారు మాత్రం హాజరుకావాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే పనులు జరుగుతున్న చోట కరోనా కట్టడి కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ లేఆఫ్‌‌ను విధించడం వల్ల పరిశ్రమల చట్టం 1947 ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించడం జరుగుతుందని సింగరేణి యాజమాన్యం ఉత్తర్వుల్లో వెల్లడించింది.





Untitled Document
Advertisements