వనపర్తి ఘటన .. కే టీ అర్ సీరియస్

     Written by : smtv Desk | Thu, Apr 02, 2020, 07:31 PM

మహమ్మారి కరోనా వైరస్ భయంకరంగా వ్యాపిస్తున్న తరుణంలో మనదేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి మనకు తెలిసిందే. కానీ కొందరు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారు. అలాంటి వారిని పోలీసులు తమదైన రీతిలో వ్యవహరిస్తూ వారి ఇంటికి పంపిస్తున్నారు. కాగా ఇలాగె బయటకు వచ్చిన ఒక వ్యక్తిని కూడా పోలీసులు చాలా దారుణంగా కొట్టారు. ఆ బాధితుడి కొడుకు పోలీసులను వేడుకుంటున్నప్పటికీ కూడా పట్టించుకోని పోలీసులు ఆ వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టారు. ఈ దారుణమైన ఘటన వనపర్తి ప్రాంతంలో జరిగింది. ఈ దారుణమైన ఘటన పై స్పందించిన మంత్రి కేటీఆర్ ఆ పోలీసులపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ మేరకు మాట్లాడిన మంత్రి కేటీఆర్… “సందర్భం ఏదైనా…పోలీసులు అనుసరించిన ఈ రకమైన వైఖరి సరికాదని” స్పష్టం చేశారు. ఇలాంటి పోలీసుల వలన మొత్తం యంత్రాంగానికే చెడ్డ పేరు వస్తుందని, తక్షణమే ఇలాంటి పోలీసులపై కఠినమైన చర్యలను తీసుకోవాలని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా వేడుకున్నారు. ఇకపోతే తన తండ్రిని కొట్టొద్దని, ఆ బాలుడు పోలీసులను వేడుకున్నా కూడా వారు మాత్రం కనికరించలేదు. కాగా ప్రస్తుతానికి ఈ ఘటన కి సంబందించిన వీడియో వైరల్ అవుతుంది.





Untitled Document
Advertisements