కరోనా వైరస్ పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పై విమర్శలు

     Written by : smtv Desk | Thu, Apr 02, 2020, 10:08 PM

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరు పట్ల మాజీ ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుంటే దాన్ని చిన్న విషయం లాగా తీసుకోవద్దని చంద్రబాబు జగన్ కి సూచించారు. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ నీ నిర్ధారించే ల్యాబ్ లతో పాటుగా, టెస్టింగ్ లు కూడా ఎక్కువగా చేయాలని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగు ల్యాబ్ లలో ఇప్పటివరకు 1,307 మాత్రమే నిర్వహించడం పట్ల చంద్రబాబు జగన్ తీరు నీ తప్పుబట్టారు. అయితే మిగతా రాష్ట్రాలైన మహారాష్ట్రలో 6,323, కేరళలో 7,965, రాజస్థాన్ లో 6,530, కర్ణాటక లో 3,799, తమిళనాడు లో 2,796 పరీక్షలు నిర్వహించినట్లు జగన్ కి రాసిన లేఖలో తెలిపారు.

చంద్రబాబు నాయుడు ఈ విషయం పట్ల చాలా సీరియస్ అయ్యారు. మిగతా రాష్ట్రాలతో పోలుస్తూ ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పై విమర్శలు చేశారు. అయితే పాజిటివ్ కేసులను దాచి పెట్టడంతో పాటుగా తక్కువ లెక్కలు చెబుతున్నారు అనే ఉద్దేశ్యంతో ప్రజల్లో ఉందని ప్రచారం అల ఉందని వ్యాఖ్యానించారు. నిజాలను దాచితే అది పెను ప్రమాదం గా మారుతుంది అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రోజు విడుదల చేసే హెల్త్ బులితెన్లు చాలా పారదర్శకంగా ఉండాలి అని వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements