కరోనా వైరస్ ను నిరోధించేంందు కోరోఫ్లూ అనే పేరుతో వాక్సిన్‌

     Written by : smtv Desk | Sat, Apr 04, 2020, 08:29 PM

గత కొంత కాలంగా ప్రపంచ దేశాలను అన్నింటిని కూడా వణికిస్తున్నటువంటి భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టడానికి హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాక్సిన్ కంపెనీ భారత్ బయోటెక్ సంస్థ పూనుకుంది… అయితే ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ఆ భారత్ బయోటెక్ సంస్థకి శుభాకాంక్షలు తెలిపారు. కాగాఈ మేరకు మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కాగా “కరోనా వైరస్ ను నిరోధించేంందు కోరోఫ్లూ అనే పేరుతో వాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్న మన హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్‌కు నా బెస్ట్ విషెస్. సీఎమ్‌డీ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఆయన టీమ్‌కు గుడ్‌ లక్. మీ అందరూ విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని కేటీఆర్ తన ట్విట్టర్ వేదిక ద్వారా పోస్టు చేశారు.

అయితే ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ తయారు చేయడం కోసం విస్కాన్‌సిన్ – మాడిసన్ యూనివర్సిటీ, వ్యాక్సిన్ కంపెనీ ఫ్లూజెన్‌తో కలిసి పని చేయనున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ సంస్థ మళ్ళీ ఇతర ప్రముఖమైన సంస్థలతో కలిసి వైరాలజిస్టులతో కలిసి ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ “క్లోరోఫ్లూ”ను అభివృద్ధి చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా ఫ్లూజెన్ కంపెనీకి చెందిన ఫ్లూ వ్యాక్సిన్ ఆధారంగా కరోనా కోసం టీకాను తయారు చేసే పనిలో ఉన్నామని చెప్పింది. ఫేజ్ 1, ఫ్లేజ్ 2 క్లినికల్ పరీక్షల దశలో ఉందని కంపెనీ బిజినెస్ డెవలప్‌మెంట్ అధిపతి రాచెస్ ఎల్లా తెలిపారు.





Untitled Document
Advertisements