సీఎం జగన్‌పై అదిరిపోయే సెటైర్లు

     Written by : smtv Desk | Sat, Apr 04, 2020, 09:55 PM

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అదిరిపోయే సెటైర్లు వేశారు. సీఎం జగన్ వైఖరిపై మండిపడ్డ లోకేశ్ ఆయన మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు, మా ఇంటికొస్తే ఏం తెస్తారనుకునే రకమని ఎద్దేవా చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్రం చేస్తున్న సహాయం తాను చేస్తున్నట్టు బిల్డ్ అప్ ఇస్తున్నాడే తప్ప రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయమేమీ లేదని అన్నారు. కాంట్రాక్టర్లపై జగన్‌కు ఉన్న ప్రేమ ప్రజలు, రైతులు, డాక్టర్లు, ఉద్యోగస్తులపై లేకపోవడం బాధాకరమని అన్నారు. గత ఏడాది కంటే 30 వేల కోట్లు అధిక ఆదాయం ఉన్నా కూడా డాక్టర్లకు ఇచ్చే మాస్కులు, ఉద్యోగస్తుల జీతాల నుండి ప్రజలకు అందించే సహాయం వరకూ అన్నింటిని కోతలు పెడుతున్నారని అన్నారు. చాలా రాష్ట్రాలలో చాలా రకల నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తుంటే ఏపీలో మాత్రం సీఎం జగన్ బీద అరుపులతో సరిపెడుతున్నారని అన్నారు.

Untitled Document
Advertisements