మన దేశాన్ని మళ్లీ తెరవాల్సిన అవసరం ఉంది

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 01:16 PM

అమెరికాలో కరోనా విలయతాండవంపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మృతుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. చాలా క్లిష్టమైన వారం రోజుల సమయాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. 'వచ్చే వారం రోజులు చాలా క్లిష్లమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా మరణాలు సంభవిస్తాయి' అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

అత్యంత ప్రభావిత రాష్ట్రాలను ఆదుకుంటామని ట్రంప్ భరోసా ఇచ్చారు. వైద్య సదుపాయాలు కల్పిస్తూ, మిలిటరీ సేవలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వేలాది మంది సైనికలు, వైద్య నిపుణులు సాయం అందిస్తున్నారని చెప్పారు. న్యూయార్క్‌లో 1,000 మంది మిలిటరీ సిబ్బంది మోహరించారని తెలిపారు.

అయితే, ఈస్టర్‌ రోజున సామాజిక దూరం నిబంధనలను సడలిస్తామని తెలిపారు. 'మన దేశాన్ని మళ్లీ తెరవాల్సిన అవసరం ఉంది' అని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలో మూడు లక్షల మందికి పైగా ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. 8,500 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క శనివారం రోజునే 630 మంది మృతి చెందారు.





Untitled Document
Advertisements