ధోనీతో గొడవపై క్లారిటీ ఇచ్చిన సీనియర్ క్రికెటర్

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 04:18 PM

ధోనీతో గొడవపై క్లారిటీ ఇచ్చిన సీనియర్ క్రికెటర్

2005 లో భారత్‌లో పాకిస్థాన్ జట్టు పర్యటించింది. ఈ పర్యటనలో భారత జట్టు ఆరు వ‌న్డేల‌ సిరీస్‌ను 4-2తో గెలుపొందింది. అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన నమోదైంది. భారత వికెట్ కీపర్ ఎంఎస్ ధోనిపై అప్పటి పేసర్ ఆశిష్ నెహ్రా ఒక సంద‌ర్బంలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అయితే తాజాగా ధోనితో గొడవ పడడంపై నెహ్రా స్పందించాడు.


నిజానికి ఆ వీడియోను అందరూ విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్ కు సంబంధించి అనుకుంటారని, అది కాదని, ఆ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో వన్డే వీడియో అని నెహ్రా గుర్తు చేశాడు. మరోవైపు ధోనిపై తాను అలా ప్రవర్తించడంపై సంతృప్తిగా లేనిని చెప్పుకొచ్చాడు. ఆ బాల్‌కు ముందు షాహిద్ అఫ్రిదీ తన బౌలింగ్ లో సిక్సర్ బాద‌డ‌ని గుర్తు చేసుకున్నాడు.


ఆ తర్వాత బంతికి ఆఫ్రిది క్యాచ్ ఇవ్వ‌గా.. అటు వికెట్ కీపర్ ధోనీ గాని, స్లిప్‌లో ఉన్న రాహుల్ ద్రావిడ్ గాని అందుకోలేక పోయారు అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ధోనిపై తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు గుర్తు చేసుకున్నాడు. ఇలాంటి సమయంలో ఏ క్రికెటర్ అయినా కూడా అలానే ప్రవర్తిస్తాడు అని తెలిపాడు. ఘ‌ట‌న జరిగిన తర్వాత ధోనీ, ద్రవిడ్ తనతో మామూలుగానే ఉన్నారని పేర్కొన్నాడు. అయితే అప్పటి తన ప్రవర్తన పై చింతించినట్లు తెలిపాడు. ఆ తర్వాత ధోనీ భారత సార‌థిగా ఎదిగాక కూడా నెహ్రా అత‌ని కెప్టెన్సీలో ఆడాడు. 2011 వన్డే ప్రపంచక‌ప్‌ గెలుపొందిన భారత జట్టులో త‌ను సభ్యుడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన తర్వాత నెహ్రా.. తిరిగి జాతీయ‌జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం నిలకడగా రాణించి టీ20 ప్రపంచకప్‌లో కూడా ఆడాడు. ఇక 2017లో రిటైర్మెంట్ ప్రకటించాడు.






Untitled Document
Advertisements