టార్చిలైట్లు వేసి ఆకాశంలోకి చూపించినంత మాత్రాన పరిష్కారం ఓస్ వస్తదా...

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 04:50 PM

కరోనా వైరస్‌ నివారణకు మోదీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టడం లేదని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. కోవిడ్‌ కట్టడికి తగినన్ని పరీక్షలు నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు. చప్పట్లు కొట్టమని, టార్చిలైట్లు వెలిగించమని ప్రధాని పిలుపునివ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘కోవిడ్‌-19 వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకునేందుకు భారత్‌లో తగినన్ని పరీక్షలు చేయడం లేదు. ప్రజలను చప్పట్లు కొట్టమని, టార్చిలైట్లు వేయమని పిలుపునిస్తున్నారు. టార్చిలైట్లు వేసి ఆకాశంలోకి చూపించినంత మాత్రాన పరిష్కారం లభించద’ని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు





Untitled Document
Advertisements