శుభవార్త...భారీగా తగ్గుతున్న బంగారం ధరలు

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 04:58 PM

శుభవార్త...భారీగా తగ్గుతున్న బంగారం ధరలు

బంగారం ధర తగ్గింది. పసిడి వెలవెలబోయింది. వారం రోజుల్లో బంగారం ధర భారీగానే పడిపోయింది. అయినప్పటికీ కూడా బంగారం ధర గరిష్ట స్థాయిల్లోనే ఉండటం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి కూడా దిగొచ్చింది.

హైదరాబాద్ మార్కెట్‌లో వారం రోజుల్లో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1810 పడిపోయింది. దీంతో బంగారం ధర రూ.41,770 నుంచి రూ.39,960కు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.1320 తగ్గుదలతో రూ.45,300 నుంచి రూ.43,980కు దిగొచ్చింది.


పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వారం రోజుల్లో కేజీ వెండి ధర రూ.1150 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.40,270కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.


ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పసిడి ధర వారం ఆరంభంలో ఔన్స్‌కు 1657 డాలర్ల పైన ఉండేది. వారం చివరకు వచ్చేసరికి పసిడి ధర ఔన్స్‌కు 1648 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. వెండి ధర ఔన్స్‌కు 14.50 డాలర్ల వద్దనే కొనసాగింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.





Untitled Document
Advertisements