దేశ ప్రజలకు కేంద్రం సూచన

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 05:38 PM

కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా చేస్తున్న పోరాటం యావత్తు దేశం కలిసికట్టుగా ఉందని చెప్పేందుకు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. ప్రమిదలలో దీపాలు వెలిగించే ముందు, లేదా కొవ్వొత్తులు వెలిగించేముందు పౌరులు తమ చేతులను సబ్బుతో మాత్రమే శుభ్రంగా కడుక్కోవాలని, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లతో వద్దని హెచ్చరించింది. ఆల్కహాల్ కు మండే స్వభావం ఉన్న కారణంగా దీంతో తయారు చేసిన శానిటైజర్లను వాడకూడదని పేర్కొంది. కాగా, ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది నిమిషాల పాటు ప్రజలు తమ ఇళ్లల్లో విద్యుత్ లైట్లు ఆర్పేసి దీపాలు లేదా క్యాండిల్స్, సెల్ ఫోన్ లైట్స్, టార్చిటైట్లు వెలిగించాలన్న మోదీ పిలుపును పాటించేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





Untitled Document
Advertisements