మహేష్ మాస్ రికార్డ్స్

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 06:39 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా అనీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. మహేష్ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్లు అదిరిపోయే రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి.

టీజర్ సోసో గానే అనిపించినా అది కాస్త యూట్యూబ్ లో 30 మిలియన్ వ్యూస్ కు పైగా దాటెయ్యడం ఆశ్చర్యం. ఇదే అనుకుంటే దీని తర్వాత విడుదల చేసిన ట్రైలర్ అయితే ఊహలకు మించిన ఊర మాస్ గా ఉండేసరికి అప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ ను రాబట్టింది.

ఆ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ లో 30 మిలియన్ వ్యూస్ మార్క్ ను అందుకుంది. దీనితో ఒకే సినిమా నుంచి టీజర్ మరియు ట్రైలర్ లు 30 మిలియన్ వ్యూస్ అందుకున్నది లేదని మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Untitled Document
Advertisements