కరోనా బలి...ఒక్క రోజులో @4,716 మంది మృత్యువాత

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 06:46 PM

కరోనా బలి...ఒక్క రోజులో @4,716 మంది మృత్యువాత

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఒక్క రోజులోనే 4,716 మందిని బలి తీసుకుంది. శనివారం అన్ని దేశాల్లో కలిపి కొవిడ్ మృతుల సంఖ్య 63,886కు పెరిగింది. కరోనా పాజిటివ్ కేసులు కూడా ఒక్కరోజులోనే 78 వేలకు పైగా పెరిగాయి. ప్రపంచంలో మొత్తం కేసుల 11,72,889కు చేరాయి. మొత్తం 2,42,150 మంది కోలుకున్నారు. ఇటలీలో 1,24,632 కేసులు, 15,362 మరణాలు నమోదయ్యాయి. స్పెయిన్ లో1,24,736 కేసులు, 11,744 మరణాలు సంభవించాయి. అమెరికాలో కేసులు 3,00,432కి, మరణాలు 8,151కు పెరిగాయి. ఫ్రాన్స్ లో 82 వేల కేసులు, 7,560 మరణాలు నమో దయ్యాయి. శనివారం ఒక్కరోజే 1,053 మంది చనిపోయారు. చైనాలో కేసులు మరో 19 పెరిగి 81,639కి చేరాయి. మరో 4 మరణాలతో మృతుల సంఖ్య 3,326కు పెరిగింది. ఆరోగ్య సమస్యలు ఉన్నోళ్లు, వయసు పైబడినోళ్లకు కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నా, పలు దేశాల్లో యువతకూ వైరస్ ప్రాణాంతకంగా మారుతోందని డబ్ల్యూ హెచ్ఓ హెచ్చరించింది. చాలామంది చనిపో తున్నారని వెల్లడించింది. కొరియాలో ప్రతి ఆరుగురు కొవిడ్ మృతుల్లో ఒకరు 60 ఏళ్లలోపు వారే ఉన్నారని తెలిపింది. ఇటలీకొవిడ్ మృతుల్లో 15 శాతంమంది 50 ఏళ్లలోపు వారే ఉన్నారని పేర్కొంది. చైనాలోని వుహాన్ లో కొవిడ్ మృతులకు ప్రజలు నివాళులు అర్పించారు. చైనా జెండాలను సగం కిందకు దించారు. కొవిడ్ గురించి మొదటగా హెచ్చరించి, ఆ వైరస్ వల్లే చనిపోయిన డాక్టర్ లీ వెన్ లియాంగ్, 14 మంది వైద్య సిబ్బంది స్మారకార్థం.. కొవిడ్ మృతులను ‘అమరవీరులు’గా గౌరవించేందుకు ఈ దినాన్ని పాటిస్తున్నట్లు సర్కారు చెప్పింది. ఈజిప్టులో నిమెయిన్ కేన్సర్ హాస్పిటల్ నుక్వారంటైన్ గా మార్చిన నేపథ్యంలో అక్కడ పని చేసిన వైద్యసిబ్బం దిలో 15 మందికి వైరస్ సోకింది. ఈజిప్టులో వెయ్యికి పైగా కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి. ఆస్ట్రేలి యాలోకరోనా విపత్తువల్ల సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నవారు, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సిక్కులు ఉచితంగా ఆహారం, సరుకులు అందిస్తున్నారు. కష్ట కాలంలో నిరంతరం సేవలు అందిస్తున్నారు. శ్వాస ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందన్న భయం నేపథ్యంలో అమెరికన్లంతా మాస్కు లు కట్టుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది. మాట్లాడుతున్నప్పుడు కూడా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని, అంతా మాస్కులు పెట్టుకోవాలని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ చీఫ్ ఆంథోనీ ఫాసీ చెప్పారు.





Untitled Document
Advertisements