"ధోనీ ఫేవరెట్ కెప్టెన్"

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 07:00 PM


టీ20 క్రికెట్లో బెస్ట్ ఓపెనర్లు ఎవరనే ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయినా.. ఆస్ర్టేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ ఇద్దర్ని ఎంపిక చేశాడు. టీమిండియా స్టార్రోహిత్ శర్మతో పాటు డేవిడ్ వార్నర్ ఈ స్లాట్స్ కు సరిగ్గా సరిపోతారని చెప్పాడు. సమకాలిన క్రికెట్లో బ్యాటింగ్, స్టాట్స్ పరంగా ఈ ఇద్దరు ఇప్పుడు బెస్ట్ గా ఉన్నారని చెప్పాడు. ఐపీఎల్లో చెన్నై తన ఫేవరెట్ టీమ్ చెప్పిన మూడీ.. ధోనీ ఫేవరెట్ కెప్టెన్ అని వెల్లడించాడు. ‘బెస్ట్ ఓపెనర్లను ఎంపిక చేయడం చాలా టఫ్. కానీ నావరకైతే రోహిత్, వార్నర్ బెస్ట్’ అని ట్వీట్ చేశాడు. ఇండియాలో టాలెంట్ ఉన్న కుర్రాళ్లకు కొదువలేకపోయినా.. ఎమర్జింగ్ ప్లేయర్గా తన ఓటు మాత్రం శుభమన్ గిల్ కే అన్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు.. మంచి క్రికెటింగ్ బ్రెయిన్ ఉందన్నాడు. రవీంద్ర జడేజా సూపర్ ఫీల్డర్ అన్న మూడీ ఇండియా టీమ్లో తన ఫేవరెట్ క్రికెటర్ కోహ్లీ అన్నాడు.

Untitled Document
Advertisements