ధోని విశ్వరూపానికీ 15 ఇయర్స్

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 07:31 PM

2005, ఏప్రిల్​ 5.. మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచానికి తెలిసిన రోజు. ఆ రోజు పాకిస్థాన్ బౌలింగ్​ను మహేంద్రుడు చీల్చిచెండాడి తొలి శతకం నమోదు చేసి నేటికి సరిగ్గా 15ఏండ్లు. ఆరు వన్డే సిరీస్​లో భాగంగా విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో గంగూలీ నిర్ణయంతో వన్​డౌన్​లో వచ్చిన ధోనీ విశ్వరూపం చూపాడు. ఓపెనర్ సచిన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో ఓపెనర్ సెహ్వాగ్​(74) ఔటైనా ధోనీ జోరు తగ్గించలేదు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని మోతెక్కించాడు. అతడు కొట్టిన హెలీకాప్టర్ షాట్లకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఆ తర్వాత ద్రవిడ్(52) అండగా మహీ మరింత రెచ్చిపోయి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్​లో మొత్తంగా 123 బంతులు ఆడిన ధోనీ 15ఫోర్లు, 4సిక్స్​లు బాది 148 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్​లో భారత్ 58పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత కెరీర్​లో ధోనీ ఎప్పుడూ తిరిగిచూసుకోలేదు. ఆటగాడిగా ఘనతలు సాధిస్తూనే.. అత్యుత్తమ కెప్టెన్​గానూ ఎదిగి.. టీమ్​ఇండియాకు రెండు ప్రపంచకప్​లు(2007 టీ20, 2011వన్డే)​ అందించాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్​తర్వాతి నుంచి ధోనీ అంతర్జాతీయ క్రికెట్​కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్​లో మొత్తం 350 వన్డేలు ఆడిన మహేంద్రుడు 50కుపైగా సగటులో 10,773పరుగులు చేశాడు. 183పరుగుల అజేయ అత్యధిక స్కోరును శ్రీలంకపై 2005 అక్టోబర్ 31నే నమోదు చేసి సత్తాచాటాడు.

Untitled Document
Advertisements