ముందుంది పెను ముప్పు .. మనుషులకే కాదు జంతువులకు సోకుతున్న కరోనా వైరస్ ...

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 10:41 AM

భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ యావత్ ప్రపంచ దేశాల ప్రజలందరినీ కూడా వణికిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ వైరస్ కారణంగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది మరణించగా, కొన్ని లక్షల మందిలో ఈ వైరస్ లక్షణాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని సమాచారం. ఇకపోతే ఈ కరోనా వైరస్ ఈమధ్య కాలంలో మరింత ఉదృతంగా మారుతుంది. ఇన్ని రోజులు మనుషుల్లో ఈ లక్షణాలు కనిపించగా, మొదటి సారి జంతువుల్లో కూడా ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని సమాచారం. కాగా అమెరికాలోని న్యూయార్క్ లోని ఒక “జూపార్క్” లో ఉన్న నాలుగేళ్ళ పులికి ఈ వైరస్ సోకిందని అధికారులు గుర్తించారు.

కాగా న్యూయార్క్ లోని బ్రాంక్స్ జూ లో నాలుగేళ్ళ పులి నాడియా కి, ఆ జూ పార్క్ లో పని చేస్తున్న ఒక ఉద్యోగి నుండి ఈ వైరస్ సోకిందని అమెరికన్ ఫెడరల్ అధికారులు వెల్లడించారు. దీని కారణంగా జూలో ఉన్న మరో ఆరు పులులు, సింహాలు, నాలుగు కుక్కలు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. అయితే ఈ విషయం గమనించిన అధికారులు గత నెల 16న జూను మూసివేశారు. ప్రస్తుతానికి ఈ వైరస్ సోకిన జంతువులను కూడా ఐసోలేషన్ లో ఉంచి, ప్రత్యేకమైన చికిత్స ని అందిస్తున్నామని జూపార్క్ డైరెక్టర్ జిమ్ బ్రెహేనీ తెలిపారు.

Untitled Document
Advertisements