మహేష్ పేరు ఎలా వచ్చిందో నాకు తెలీదు

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 10:43 AM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ నీ చిరు నే ప్రకటించారు. అయితే సై రా నరసింహ రెడ్డి చిత్రం తర్వాత, చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి పాత్రతో పాటుగా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం చరణ్ నీ తీసుకున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ లో రామ్ చరణ్ బిజీ గా ఉండుట వలన ఈ చిత్రంలో మహేష్ బాబు నటిస్తారు అని చాలా వరకు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా భారీ గా రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని కూడా అన్నారు. అయితే మళ్ళీ తెరపైకి రామ్ చరణ్ పేరు వచ్చింది. అయితే ఈ గాసిప్ ల పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

ఒక ఇంటర్వూ లో మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అసలు కొరటాల శివ చిత్రం ఆచార్యలో మొదటినుండి ఒక కీలక పాత్ర కోసం రామ్ చరణ్ నే అనుకుంటున్నాం. కానీ మహేష్ పేరు ఎలా వచ్చిందో నాకు తెలీదు అని వ్యాఖ్యానించారు. మహేష్ నాకు బిడ్డతో సమానం. అతనితో కలిసి నటించడం నాకు ఆనందం కలిగించే అంశం, కానీ ఈ చిత్రం కోసం మహేష్ నీ అనుకోలేదు అని తేల్చి చెప్పారు. అయితే చరణ్ వాళ్ల అమ్మ కోరిక కూడా రామ్ చరణ్ ఈ చిత్రంలో నటించడమే అని అన్నారు.

Untitled Document
Advertisements