పెరుగుతున్న కేసులు .. లాక్ డౌన్ పొడగిస్తారా ?

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 10:46 AM

ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ దారుణంగా పెరుగుతున్న తరుణంలో, ఎలాగైనా సరే ఈ మహమ్మారిణి నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. అయితే ఈ లాక్‌డౌన్ కారణంగా దేశప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు లాక్‌డౌన్ ఎత్తేసే సమయం దగ్గర పడింది. మరికొద్దిరోజుల్లో లాక్‌డౌన్ ఎత్తేస్తారని అందరు కూడా భావిస్తున్నారు. కానీ రోజురోజుకి ఈ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ లాక్‌డౌన్ విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికితోడు గత కొద్దీ రోజులుగా లాక్‌డౌన్ పొడగిస్తారని వస్తున్న వార్తలతో ప్రజలందరూ కూడా మరింతగా భయాందోళనకు గురవుతున్నారు.

కాగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా కరోనా వైరస్ ని నివారిస్తున్నామని చెప్పుకునేలోగానే దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మార్కాజ్ ప్రార్థనలకి హాజరైన వారి వళ్ళ ఈ వైరస్ మరింతగా పెరుగుతుంది. వారి వలన ఈ కేసులు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. కాగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4298 కేసులు నమోదయ్యాయి. అందులో 118 మంది మరణించారు. ఈకేసులు మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకనే ఈ లాక్‌డౌన్ ని మరో 15 రోజులు (ఏప్రిల్ 30) వరకు పొడిగించే ఛాన్స్ ఉందని ప్రజలందరూ కూడా బాధ్యత గా ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నారు.





Untitled Document
Advertisements