రాత్రి 9గం...తన స్టైల్ లో లైట్ వెలిగించిన వర్మ

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 11:38 AM

రాత్రి 9గం...తన స్టైల్ లో లైట్ వెలిగించిన వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన వివాదాస్పదమే. తాజాగా ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు ప్రధాని పిలుపు మేరకు దేశ ప్రజలంతా లైట్ దియా కార్యక్రమం నిర్వహించారు. కొందరు దీపాలు వెలిగిస్తే... మరికొందరు క్యాండిల్స్ వెలిగించారు. ఇంకొందరు మొబైల్‌లో ఫ్లాష్ లైట్స్ ఆన్ చేశారు. అయితే వర్మ మాత్రం రాత్రి 9 గంటలకు అందిరలా కాకుండా చాలా స్పెషల్ గా చేశాడు. దీపాలు, క్యాండిల్స్ కాకుండా ఆయన వెరైటీగా సిజర్ లైటర్ వెలిగించి సిగరెట్ వెలిగించాడు. కొన్ని సెకన్ల పాటు ఉన్న ఆ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు వర్మ. వర్మ చేసిన ఈ పనిపై నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు. తిక్క మామూలుగా లేదంటూ ఓ నెటిజన్ విమర్శించాడు. మరో నెటిజన్ 9 నిమిషాలు అలాగే ఉంచాలన్నాడు.




ప్రస్తుతం వర్మ కరోనా వైరస్‌ కూడా వదలడం లేదు. ఇప్పటికే కరోనాపై ఒక సాంగ్ రాసి పాడిన ఆర్జీవీ ఆదివారం ప్రధాని పిలుపు మేరకు రాత్రి 9 గంటలు 9 నిమిషాలు దీప జ్యోతులు వెలిగించమంటే.. దేశ ప్రజలంతా ఆయన సందేశం మేరకు దీపాలు, ఫ్లాష్ లైట్లు, క్యాండిల్స్ వెలిగించారు. అయితే వర్మ మాత్రం వెరైటీగా సిగరెట్ వెలిగించాడు. అయితే ప్రతి దాన్ని కాంట్రవర్సి చేయడం వర్మకు అలవాటే. అలా అందరి నోళ్లలో నానాలనుకుంటాడు. ప్రతీ విషయాన్ని క్యాష్ చేసుకొని పబ్లిక్ టాక్‌గా మారాలనుకుంటాడు. అందుకే అందరితో పాటుగా తాను కూడా ఏ క్యాండిల్ కానీ ఫ్లాష్ లైట్ కానీ వెలిగిస్తే ఎలా అనుకున్నాడో ఏమో ఏకంగా సిగరెట్ వెలిగించాడు.



సిగరెట్ వెలిగించిన వర్మ ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు వర్మ.. సిగరెట్ తాగడంపై ప్రభుత్వ హెచ్చరికను పాటించకపోవడం కన్నా కరోనా గురించి ప్రభుత్వ హెచ్చరిలకు పాటించకపోవడం చాలా ప్రమాదకరమని అన్నారు. దీపాల వెలిగించడం లో కూడా సిగరెట్ తో లింక్ పెట్టి ప్రజల మీద సెటైర్ వేశాడు. నెటిజన్స్ చాలామంది విమర్శించిన కొందరు మాత్రం వర్మ చేసిన పనిని లైట్ తీసుకున్నారు.





Untitled Document
Advertisements