PF ఖాతాదారులకు ఆధార్ కార్డుతో మరో బెనిఫిట్!

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 11:55 AM

PF ఖాతాదారులకు ఆధార్ కార్డుతో మరో బెనిఫిట్!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తాజాగా తన సబ్‌స్క్రైబర్లకు తీపికబురు అందించింది. ఆన్‌లైన్‌లోనే పుట్టిన తేదీ వివరాలను మార్చుకునేందుకు నిబంధనలను సవరించింది. ఇకపై ఆధార్ కార్డును కూడా ప్రూఫ్‌గా తీసుకుంటామని ప్రకటించింది. దీని కోసం కేవైసీ నిబంధనలను సరళీకరించింది. కేంద్ర కార్మిక శాఖ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది.

‘కోవిడ్ 19 నేపథ్యంలో ఆన్‌లైన్ సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని ఈపీఎఫ్‌వో భావిస్తోంది. అందుకే ఈపీఎఫ్‌వో రికార్డ్స్‌లో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోడానికి పీఎఫ్ సభ్యులకు రూల్స్ సవరించింది’ అని కార్మిక శాఖ పేర్కొంది. కార్మిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. పీఎఫ్ అకౌంట్‌లో పుట్టిన తేదీ మార్చుకోవడానికి ఇకపై ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అంతేకాకుడా డేట్ ఆఫ్ బర్త్‌ను ఆన్‌లైన్‌లోనే మార్చుకోవచ్చు. వేగంగానే పని పూర్తవుతుంది. కొత్త రూల్స్‌కు సంబంధించి ఈపీఎఫ్‌వో ఇప్పటికే ఫీల్డ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్ రిక్వెస్ట్‌లను వెంటనే ప్రాసెస్ చేయాలని కూడా సూచించింది. దీంతో వారిపై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకోవాలని తెలిపింది. కాగా ఈపీఎఫ్‌వో ఇటీవలనే పీఎఫ్ విత్‌డ్రా రూల్స్‌ కూడా సవరించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు వారి అకౌంట్ల నుంచి 75 శాతం మొత్తాన్ని సులభంగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం ఎలాంటి రీజన్ కూడా తెలియజేయాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది.





Untitled Document
Advertisements