"రోహిత్‌కు బౌలింగ్ కష్టం"

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 11:57 AM


స‌మ‌కాలీన క్రికెట్ ప్రపంచంలో భార‌త ఓప‌న‌ర్ రోహిత్ శ‌ర్మ‌ను విధ్వంస‌క బ్యాట్స్‌మ‌న్‌గా ప‌రిగణిస్తారు. ముఖ్యంగా వైట్‌బాల్ క్రికెట్‌లో పలు రికార్డులు త‌న పేరిటే ఉన్నాయి. వ‌న్డేల్లో మూడు డ‌బుల్ సెంచ‌రీల‌తోపాటు అత్యుత్తమ వ్య‌క్తిగ‌త స్కోరు (264) అత‌నే సాధించాడు. అయితే తాజాగా రోహిత్‌పై పాకిస్థాన్‌కు చెందిన స్పిన్న‌ర్ షాదాబ్ ఖాన్ ప్ర‌శంస‌లు కురిపించాడు. సోష‌ల్ మీడియాలో త‌న‌ను అడిగిన ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా రోహిత్‌కు బ్యాటింగ్ చేయడం చాలా క‌ష్ట‌మ‌ని అత‌ను వ్యాఖ్యానించాడు. ఇరుదేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకోవడంతో భార‌త్‌-పాక్ జ‌ట్ల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు చోటు చేసుకోవ‌డం లేదు. ఇరుజ‌ట్ల గ‌తేడాది చివ‌రిసారిగా ఇంగ్లాండ్‌లో జ‌రిగిన వన్డే ప్ర‌పంచ‌క‌ప్ లీగ్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించి, టోర్నీలో దాయాదిపై అజేయ రికార్డును కొన‌సాగించింది.ఈ మ్యాచ్‌లో రోహిత్ సెంచ‌రీ (140)తో చెల‌రేగాడు. తాజాగా రోహిత్ గురించి షాదాబ్ మాట్లాడుతూ.. హిట్‌మ్యాన్‌కు బౌలింగ్ చేయాలంటే చాలా ఖ‌చ్చిత‌త్వంతో బౌలింగ్ చేయాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నాడు. కాస్త పొర‌పాటు దొర్లినా బంతి, స్టాన్స్‌లోకి వెళుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇక అత‌నికి అనువైన ప్ర‌దేశంలో ఎటువంటి బంతిని వేసినా, సిక్స‌ర్ ఖాయ‌మ‌ని పేర్కొన్నాడు. ఇక గ‌తేడాది భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో షాదాబ్ తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో త‌ను 9 ఓవ‌ర్లు బౌలింగ్ వేసి, 61 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

Untitled Document
Advertisements