అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారా..అయితే ఇలా చెయ్యండి....

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 12:16 PM

అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారా..అయితే ఇలా చెయ్యండి....

చాలా మంది అనేక కారణాల వల్ల త్వరగా పిల్లలు వద్దనుకుంటారు. దీనికి వారి ఆర్థిక కారణాలు కావొచ్చు, ఇతర బాధ్యతలు కావొచ్చు, మరింకేమైనా కావొచ్చు. ఇలా అనేక కారణాల వల్ల పిల్లల్ని వద్దనుకుంటారు. అలాంటి వారు శృంగారంలోనూ భయం భయంగా పాల్గొంటారు. అలా అందులో పాల్గొన్నా పిల్లలు పుట్టకుండా ఉండేదుకు కొన్ని ప్రత్యామ్నాయలుగా ట్యాబ్లెట్స్, కండోమ్స్ వంటివి వాడుతుంటారు. కానీ, వీటి వల్ల కొంత నెగెటీవ్ ఉంటుందని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారు IUDని వాడడం వల్ల చక్కని ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.. నేటి జనరేషన్‌లో ప్రతీ ఒక్కరూ పర్ఫెక్ట్‌ ప్లాన్‌తో జీవించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది అప్పుడే పిల్లలు కనొద్దనుకుంటున్నారు. వివాహం జరిగాక కొన్ని రోజుల వరకూ ఆ విషయం గురించి అసలు ఆలోచనే లేదు అనుకుంటున్నారు. అందుకోసమే ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. దీని వల్ల త్వరగా పిల్లలు పుట్టరు. అనే వాటిని ఆశ్రయిస్తారు.. చాలా మంది పిల్లలు వద్దనుకునేవారు ఇప్పటివరకూ అనేక గర్భనిరోధకాలను ఆశ్రయించారు. అందులో ఆడవారు కలయిక జరిగిన కొన్ని గంటల్లోనే మాత్రను వేసుకోవడం, కండోమ్స్ వాడకం, అదే విధంగా ఆడవారు ప్రతీ రోజూ గర్భనిరోధకాలను వాడడం.. ఇలా అనేకం ఉన్నాయి. అయితే, గర్భనిరోధకాలలో చెప్పే కండోమ్స్‌లో ఆడవారు, మగవారు వాడేవి ఉంటాయి. ఇందులో ఎక్కువగా మగవారు వాడేవే ఉంటాయి. ఆడవారి కండోమ్స్ గురించి చాలా మందికి అవగాహన కూడా లేదు.. అయితే, ఇవే అంశాలపై ఎన్నో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అనేక కొత్త అంశాలను కనిపెట్టారు. అందులో ఇంజెక్షన్స్, జెల్ ఇలా అనేక గర్భ నిరోధకాలు ఉన్నాయి. అయితే, ఇవి మార్కెట్లోకి రావడానికి సమయం పెడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, గర్భనిరోధకాలుగా చెప్పుకునే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అందులో కండోమ్స్ గురించి చెప్పాలంటే.. ఇది చాలా మంది స్త్రీలకు, మగవారికి పడకపోవడం కొన్ని చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా.. దీనిని వాడడం వల్ల అది చిరిగి ఫెయిలై అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని వాడాలంటే చాలా మంది భయపడుతుంటారు. ఇక మాత్రల వల్ల స్త్రీల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఫ్యూచర్‌లో కొన్ని సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అదే విధంగా గర్భనిరోధకాలలో ముఖ్యమైన పరికరం గురించి నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే IUD దీన్నే ఇంట్రాటూరైన్ అని కూడా అంటారు. ఇది ఇప్పటివరకూ ఉన్న గర్భనిరోధక పద్ధతులలోనే అత్యంత సురక్షితమైనదని నిపుణులు చెబుతున్నారు. T ఆకారంలో ఉండే ప్లాస్టిక్ ముక్కలా ఉంటుంది. దీన్ని స్త్రీ గర్భాశయంలోకి చొప్పిస్తారు. దీని వల్ల మగవారి వీర్యం స్త్రీ గర్భాశయంలోకి వెళ్లగానే.. దాన్ని నిర్వీర్యం చేసేలా పరికరం ఉంటుంది. అయితే, ఇది కచ్చితంగా వైద్యుల సంరక్షణలోనే చేయించుకోవాలి. లేకపోతే అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.





Untitled Document
Advertisements