రెడ్ జోన్‌: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 03:29 PM

భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ దేశవ్యాప్తంగా దారుణంగా విస్తరిస్తున్న తరుణంలో భారత కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల కు పలు హెచ్చరికలు చేస్తుంది. కాగా ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి మార్కజ్ ప్రార్థనలకు హాజరైన వారి కారణంగా ఈ వైరస్ మరింతగా వ్యాపిస్తుందని, అందుకని ఆ ప్రార్థనలకు హాజరైన వారిపై ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని, వారికుటుంబాలు, సన్నిహితులు, వారి పరిసరాలు అన్ని కూడా ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా వారందరిని త్వరగా గుర్తించి వారందరికీ కూడా త్వరగా వైద్య పరీక్షలు జరిపించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.

ఇకపోతే కేంద్రం దేశవ్యాప్తంగా 96 జిల్లాలను రెడ్ జోన్‌గా ప్రకటించింది. వాటిలో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి పలు జిల్లాలని జోన్ లు గా ప్రకటించింది. కాగా ఆంధ్రప్రదెశ్ నుండి విశాఖపట్నం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఈ ప్రదేశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమనుకుంటే లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేయాలనీ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆ ప్రదేశాల్లో అత్యవసర క్వారంటైన్ కేంద్రాలు, ఆస్పత్రులను యుద్ధ ప్రాతిపాదికన రెడీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Untitled Document
Advertisements