రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 266

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 03:31 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయంకరమైన కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా కేసులు నమోదవ్వగా, తాజాగా మరొక 14 కేసులు నమోదవడంతో వైద్యాధికారులందరు కూడా అప్రమత్తమయ్యారు. ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. నేడు పెరిగిన కరోనా కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 266 కి చేరుకుంది. వీరిలో మరొక ఇద్దరు కరోనా వైరస్ కారణంగా మరణించినట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. అయితే వీరిలో ఇప్పటికే 5 మంది బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుండి డీఛార్జి అయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ తరుణంలో ఈ వైరస్ ని నివారించడానికి అధికారులందరూ కూడా ప్రజలకు తగు జాగ్రత్తలు చెబుతూ, ప్రభుత్వ నిర్ణయాలకి సహకరించాలని కోరుతున్నారు.

జిల్లాల వారీగా కరోనా బాధితుల వివరాలు…

అనంతపురం – 6
చిత్తూరు – 17
తూర్పు గోదావరి – 11
గుంటూరు – 32
కడప – 23
కృష్ణ – 28
కర్నూలు – 56
నెల్లూరు – 34
ప్రకాశం – 23
శ్రీకాకుళం – 0
విశాఖపట్నం – 20
విజయనగరం – 0
వెస్ట్ గోదావరి – 16

Untitled Document
Advertisements