నల్లగొండ జిల్లాలో 14 కరోనా పాజిటివ్ కేసులు

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 03:32 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ దారుణంగా వ్యాపిస్తుంది. ఇకపోతే తెలంగాణ లో రోజురోజుకొ కరోనా బాధితులు పెరుగుతుండడంతో రాష్ట్రంలోని వైయాధికారులు, ప్రభుత్వాధికారులు, వైద్యాధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు. ఈ కేసులు మరింతగా పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ మహమ్మారి వ్యాపిస్తుండడంతో రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా వైరస్ వ్యాపించకుండా నివారణ చర్యలు అధిక మొత్తంలో చేపడుతున్నారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ఈ కరోనా వైరస్ కేసులు భారీగా నమోదయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు.

కాగా ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం నల్లగొండ జిల్లాలో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే వీరందరిని కూడా హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించి ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారని సమాచారం. వీరితో పాటే మరికొందరికి కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వైరస్ నెగటివ్ అని వచ్చిన వారిని క్వారెంటైన్ కి తరలిస్తున్నారు. మరికొందరి రెపోర్ట్లురావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. కాగా కరొనపాసిటివ్ వచ్చిన పరిసర ప్రాంతాల్లో పూర్తిగా నిర్బంధాన్ని చేపట్టి, ఫెన్సింగ్ లను ఏర్పాటు చేసి, రాకపోకలను కూడా నిలిపివేశారు.

Untitled Document
Advertisements