ఏపీఎస్ఆర్టీసీ బుకింగ్స్ స్టార్ట్

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 03:34 PM

మహమ్మారి కరోనా వైరస్ దేశంలో దారుణంగా ప్రబలుతున్న కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలన్నీ కలిసి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కి అమలు చేశాయి. ఈ మేరకు కొంత కరోనా విరుస్తుంని నివారించమని చెప్పుకుంటున్నప్పటికీ కూడా, ఢిల్లీలో జరిగిన మార్కాజ్ ప్రార్థనలకి హాజరైన వారి వలన ఈ వైరస్ దారుణంగా వ్యాపిస్తుంది. అయితే ఈ మేరకు కరోనా వైరస్ సంఖ్య మరింతగా పెరుగుతుండడంతో లాక్ డౌన్ కాలాన్ని మరింతగా పెంచనున్నట్లు గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ పుకార్లకు అన్నింటికీ చెక్ పెడుతూ ఆంధ్రప్రదేశ్రాస్త్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం.

కాగా ఇప్పటికే అమలులో ఉన్నటువంటి లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రవాణా, వ్యాపార రంగాలు దిగజారిపోతున్నాయి. ఒకవేళ ఈ లాక్‌డౌన్ ని మళ్ళీ పొడిగిస్తే, ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కునే సమస్యలు అధికమవనున్న తరుణంలో, ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చిందని వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ బుకింగ్స్ ‌ను ప్రారంభిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి బస్ బుక్ చేసుకునే వారికి సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు మాత్రమే రిజర్వేషన్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా కరోనా ప్రభావం తగ్గితే దశల వారీగా బస్సుల బుకింగ్స్ ప్రారంభించనున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్టీసీ సంస్థ స్పష్టం చేసింది.





Untitled Document
Advertisements