కరోనా వస్తుందేమో అని తాయత్తు కట్టించుకున్నాడు .. చిరవికి పాజిటివ్...

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 03:40 PM

హైదరాబాదులో ఓ వ్యక్తికి తాయెత్తు కట్టించుకోవడం వల్ల కరోనా సోకిందనే వార్త సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే, నగరానికి చెందిన ఓ యువకుడు తనకు కరోనా సోకకుండా ఉండేందుకు తాయెత్తును నమ్ముకున్నాడు. ఆలోచన వచ్చిన వెంటనే ఓ దర్గాకు వెళ్లి తాయెత్తు కట్టించుకున్నాడు. ఆ తాయెత్తు తనను కాపాడుతుందని భావించాడు. ఆ తర్వాత కొద్దిగా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో, ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకుంటే... కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత విషయం కాస్తా పోలీసుల వరకు వెళ్లింది. దీంతో బాధితుడికి తాయెత్తు కట్టిన వ్యక్తిని కూడా పట్టుకొచ్చి, క్వారంటైన్ లో పెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Untitled Document
Advertisements