కృష్ణా జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 05:51 PM

ఒకవైపు ప్రజలందరూ కూడా భయంకరమైన కరోనా వైరస్ వలన తీవ్రమైన భయాందోళనకు గురవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. కాగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభలుతున్న తరుణంలో, ఈ వైరస్ ని నివారించడానికి దేశంమొత్తం లాక్ డౌన్ విధించిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ లాక్ డౌన్ వలన అన్ని వ్యవస్థలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి కూడా. అన్నింటితో పాటే మద్యం షాపులు కూడా మూసేసారు… ఈ నేపథ్యంలో మందు బాబులు పడుతున్న అవస్థలు అంత ఇంతా కాదు… ఒక్కక్కరు మద్యం దొరక్క పిచ్చి వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు.

కాగా ఈనేపథ్యంలో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని వణుకుడు ప్రాంత వైన్ షాపులో దొంగతనం జరిగింది. కాగా రాత్రి సమయంలో వైన్ షాపు వెనక భాగం నుండి లోపలి ప్రవేశించిన దుండగులు మందు బాటిళ్లను దొంగతనం చేశారు. దాదాపుగా 85 మద్యం బాటిల్స్‌ను చోరీ చేసినట్లు సమాచారం. అయితే దాదాపుగా ఆ బాటిళ్ల విలువ రూ.లక్షా 50 వేలు ఉంటుందని షాపు యజమానులు వెల్లడించారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Untitled Document
Advertisements