దీపాలు వెలిగించిన దేశ ప్రజలు

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 06:03 PM

కరోనా రాక్షసిపై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించారు. కరోనా చీకట్లను తరిమికొట్టేందుకు యావత్ భారతదేశం దీపాలను వెలిగించింది. దేశ ప్రజలంతా తమ ఇళ్లలోని లైట్లు అన్నీ ఆర్పేసి 9 నిమిషాల పాటు దీపకాంతులు వెదజల్లేలా చేశారు. ప్రతి ఇంటిముందు దీప ప్రజ్వలన చేశారు. గుమ్మాల ముందు, బాల్కనీల్లో నిల్చుని కొవ్వొత్తులు, దీపాలు వెలిగించారు. కొందరు తమ ఫోన్లలోని టార్చ్ ఆన్ చేశారు.

సామాన్యుల నుంచి అన్ని రంగాల ప్రముఖుల వరకు ఇందులో పాలుపంచుకున్నారు. నగరాలు, పట్టణాల్లో ప్రతివీధుల్లో దీపాలు వెలిగించారు. దీపకాంతులతో దేశం వెలిగిపోయింది. ప్రధాని మోదీ దీపాలు వెలిగించారు. దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు. దేశవ్యాప్తంగా కొవ్వొత్తులతో డాక్టర్లు సంఘీభావం తెలిపారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ దేశ ప్రజలంతా సంఘీబావం తెలిపారు. గో కరోనా అంటూ పలుచోట్ల నినాదాలు చేశారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు తమ శక్తిని చాటారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు. రాష్ట్రపతి నుంచి సినీ రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు వివిధ రంగాల్లోని ప్రముఖులు సైతం దీపాలు వెలిగించి దీపయజ్ఞానికి సంఘీభావం తెలిపారు. అన్ని రాష్ట్రాల సీఎంలు దీపాలు వెలిగించారు. తిరుమలలో టీటీడీ అధికారులు దీపాలు వెలిగించారు.

Untitled Document
Advertisements