సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.!

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 09:14 PM

తెలంగాణలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా దీనిపై ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్ కీలక విషయాలను వెల్లడించారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 364కి చేరిందని వీరిలో 45 మంది కోలుకోగా 11 మంది చనిపోయారని అన్నారు.

అయితే రాష్ట్రంలో కరోనాను రెండు దశలుగా పరిగణించాలని మొదటి దశ కింద విదేశాల నుంచి వచ్చిన వారు 25,937 మంది ఉన్నారని వీరందరిని క్వారంటైన్ చేసి పరీక్షలు చేస్తే 50 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అన్నారు. అయితే రాష్ట్రంలో మొత్తం 364 మందికి కరోనా సోకగా వీరిలో విదేశాల నుంచి వచ్చిన 35 మంది, 10 మంది ఇండోనేసియన్లు డిశ్చార్జి అయ్యారు. మరో 11 మంది చనిపోయారని మృతులంతా మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారే అని అన్నారు. ప్రస్తుతం 308 మంది కరోనా బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారని అన్నారు. అయితే మర్కజ్‌ నుంచి తెలంగాణకు 1089 మంది వచ్చారని ఇందులో 172 మందికి వైరస్ వచ్చిందని అన్నారు. వీరి వలన మరో 93 మందికి వైరస్ అంటుకుందని వీరందరినీ పట్టుకున్నామని అన్నారు. అయితే మరో రెండు రోజులలో మర్కజ్ కేసులతో లింకున్న వారందరికి పరీక్షలు పూర్తవుతాయని మరో 110 పాజిటివ్ కేసులు వచ్చే అవకాశముందని అన్నారు.





Untitled Document
Advertisements