హాయర్‌ ఏసీ, ఫ్రిజ్‌ ధరల పెంపు...

     Written by : smtv Desk | Sun, Nov 19, 2017, 03:26 PM

హాయర్‌ ఏసీ, ఫ్రిజ్‌ ధరల పెంపు...

న్యూఢిల్లీ, నవంబర్ 19 : గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులకు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ హాయర్‌ ఇండియా రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషనర్ల ధరలను 12శాతం పెంచింది. కేవలం ముడి సరకు ధరలు పెరిగినందువల్లే వస్తువుల ధరలను పెంచినట్లు తెలిపింది. దీపావళికి ముందే పెంచుదామని నిర్ణయించినా, మార్కెట్‌ పరిస్థితులు సహకరించకపోవడంతో ముందడుగు వేయలేదు. వచ్చే వారం నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని హాయర్‌ ఇండియా అధ్యక్షుడు ఎరిక్‌ బ్రగంజా తెలిపారు.

ఇటీవలే పుణెలో అదనపు ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో దిగుమతులు సగానికి పైగా తగ్గుతాయని భావిస్తోంది. ఇక్కడి ప్లాంట్‌లో ఏసీలు, టీవీ ప్యానల్స్‌, వాటర్‌ హీటర్లను తయారు చేస్తోంది. ఇందుకోసం రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టింది. రిఫ్రిజిరేటర్ల ధరలు 5-6శాతం పెరుగుతాయని ఏసీల ధరలు రెండంకెల సంఖ్యకు.. అంటే 10-12శాతం పెంచుతున్నట్లు వెల్లడించారు.





Untitled Document
Advertisements