ఆరోగ్యమే అందం...దానికి అవసరం పండ్లు!

     Written by : smtv Desk | Sun, Nov 19, 2017, 04:09 PM

ఆరోగ్యమే అందం...దానికి అవసరం పండ్లు!

చలి పెరుగట౦ వల్ల చర్మం పొడిబారడం, నిర్జీవంగా కనిపించడం ఈ సమయంలో సర్వసాధారణమే. దాన్ని తగ్గించుకునేందుకు ఎంత మాయిశ్చరైజర్‌ రాసుకున్నా, కొన్ని పండ్లు రోజూ తీసుకోగలిగితే చర్మాన్ని తాజాగా మెరిపించొచ్చు.
యాపిల్‌: ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. పైగా విటమిన్లూ, ఖనిజాలూ, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ. ఇవన్నీ చర్మానికి ఎలాంటి హానీ కలగకుండా చేసి, సహజ మెరుపును అందిస్తాయి.
బొప్పాయి: ఇందులో ఉండే విటమిన్‌ ఎ తోపాటూ పపైన్‌ అనే పోషకం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే దీన్ని ఎక్కువగా తీసుకోవాలి.
నిమ్మజాతి పండ్లు: వీటిల్లో పీచు, సి విటమిన్‌, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. చర్మం తాజాదనంతో మెరవాలంటే రోజుకొకటి తింటే చాలట. చర్మంలో సాగే గుణం పెరుగుతుంది.
దానిమ్మ: చర్మ రంధ్రాలను శుభ్రపరచడం, ముడతల్ని నివారించడం, మొత్తంగా వార్థ్యపు ఛాయల్ని అదుపులో ఉంచడం దీని ప్రత్యేకత. చర్మం పొడిబారే సమస్యనూ తగ్గిస్తుంది దానిమ్మ.
జామ: ఇందులో ఎ, సి విటమిన్లతోపాటూ లైకోపీన్‌, కెరొటీన్‌ ఉంటాయి. ఇవన్నీ ముఖంపై ముడతలు రాకుండా నివారిస్తాయి. జామలో ఉండే కె విటమిన్‌ మొటిమలు రాకుండా, చర్మం కందిపోకుండా చేస్తుంది. కళ్ల అడుగున నల్లని వలయాలనూ తగ్గిస్తుంది.





Untitled Document
Advertisements