అక్కినేని నాగార్జున.. రామ్ గోపాల్ వర్మ.. షూటింగ్‌ మొదలు

     Written by : smtv Desk | Mon, Nov 20, 2017, 11:54 AM

అక్కినేని నాగార్జున.. రామ్ గోపాల్ వర్మ.. షూటింగ్‌ మొదలు

హైదరాబాద్, నవంబర్ 20: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అక్కినేని నాగార్జున కలయికలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉదయం 10 గంటలకు ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముందే వర్మ.. చిత్రానికి సంబంధించిన ఓ కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో.. బల్లపై పోలీస్‌ టోపీ, చాయ్‌, తుపాకీ ఉన్నాయి. వాటిపైన రామ్‌ గోపాల్‌ వర్మ, అక్కినేని నాగార్జున, షూటింగ్‌ మొదలు అని రాసి ఉంది.

అంతేకాదు నాగ్ తన ట్విట్టర్ వేదికగా ఈ సినిమాలోని తన లుక్‌ని అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోలో.. ఒక చేతిలో గన్ను పట్టుకుని మరో చేతిలో డబ్బు కట్టలతో ఉన్న నాగ్‌ స్టైల్‌ హైలెట్‌గా నిలిచింది. " 28 ఏళ్ల కిత్రం వచ్చిన 'శివ' చిత్రం నా జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు మరో చిత్రం రాబోతోంది. ప్రస్తుతం నా ఫీలింగ్‌ గురించి నేను మాటల్లో చెప్పలేను. రోజూ జీవితం ఎంతో ఉత్సాహంగా గడిచిపోతోందని మాత్రం చెప్పగలను" అంటూ నాగ్‌ ట్విట్ చేశారు. గతంలో వీరి కాంబినేషన్ లో రూపొందిన 'శివ' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.





Untitled Document
Advertisements