డోనాల్డ్ ట్రంప్ కు మద్దతు పలికిన ఇండో అమెరికన్‌ సెక్రటరీ...

     Written by : smtv Desk | Mon, Nov 20, 2017, 11:59 AM

డోనాల్డ్ ట్రంప్ కు మద్దతు పలికిన ఇండో అమెరికన్‌ సెక్రటరీ...

వాషింగ్టన్‌, నవంబర్ 20 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానానికి వ్యతిరేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఓ ప్రముఖ ఇండో అమెరికన్‌ ట్రంప్‌కు మద్దతు పలికారు. వీసా విధానంపై అగ్రరాజ్యం అమెరికా సరికొత్త, కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో డొనాల్డ్‌ ట్రంప్‌ పై వలస విధానానికి వ్యతిరేకం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ట్రంప్‌ది వలసల వ్యతిరేక విధానంకాదని, అక్రమ వలసల వ్యతిరేక విధానం అంటూ శ్వేతసౌధం ప్రిన్సిపల్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ, ఇండో అమెరికన్‌ రాజ్‌షా అన్నారు.

అమెరికాకు వలస వచ్చేవారు ప్రతిభావంతులై ఉండాలని ట్రంప్‌ ప్రయత్నిస్తుడటంతో, వీసా జారీలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. చెప్పాలంటే ఈ నిర్ణయం ఆమోదయోగ్యం. ప్రజలు దీనికి కచ్చితంగా మద్దతిస్తారని రాజ్‌షా తెలిపారు. హెచ్‌-1బీ వీసాదారుల కనీస వేతనాన్ని పెంచుతూ సిద్ధం చేసిన బిల్లుకు ఇటీవల అమెరికా కాంగ్రెస్‌ కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే, వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు చర్యలను కమిటీ ప్రతిపాదించింది. హెచ్‌-1బీ వీసా బిల్లుకు అమెరికా ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో రాజ్‌ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.





Untitled Document
Advertisements