నేడు పాలపిట్ట పార్క్‌ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

     Written by : smtv Desk | Mon, Nov 20, 2017, 01:24 PM

నేడు పాలపిట్ట పార్క్‌ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్, నవంబర్ 20 ‌: ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య నగరవాసులు సైకిల్‌ తొక్కేందుకు పాలపిట్ట పార్క్‌ నుంచి అందుబాటులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా నేడు ఈ పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... పార్క్ పరిసరాలల్లో కాలుష్య వాతావరణం లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఒకప్పుడు ముళ్ల కంపలు, పిచ్చిమొక్కలతో నిండి ఉన్న ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాడంతో పాటుగా, హరితహారంలో భాగంగా దాదాపు 7వేల మొక్కలను ఇక్కడ నాటడంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో పార్క్‌ అభివృద్ధికి తోల్పడిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, సైక్లింగ్‌ కోసం వచ్చే వారికి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 230 కొత్త సైకిళ్లు అందుబాటులో ఉంటారు. ఇందుకోసం విశాలమైన సైకిల్‌ స్టాండ్‌ నిర్మించారు. ఈ సైకిల్‌ ను రోజూ ఉదయం 6-9 గంటల మధ్య, సాయంత్రం 4-6 గంటల మధ్య పార్కులో తొక్కవచ్చు. అయితే, ఈ సైక్లింగ్‌ చేసేందుకు గంటకు పెద్దలు రూ.50, పిల్లలు రూ.25 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సొంత సైకిల్‌ తెచ్చుకుంటే గంటకు రూ.25 చెల్లించాలి. నెలవారీ పాసుల కోసం రూ.800 చెల్లించాలి.





Untitled Document
Advertisements