అట్టహాసంగా ప్రారంభమైన "స్పిరిట్‌ ఆఫ్‌ లైఫ్‌" కార్యక్రమం

     Written by : smtv Desk | Mon, Nov 20, 2017, 02:53 PM

అట్టహాసంగా  ప్రారంభమైన

హైదరాబాద్, నవంబర్ 20 : బతుకమ్మ అంటే బతుకునిస్తూ, ధైర్యం, ఉత్సాహం నింపే అమ్మ అని, ప్రకృతిని అమ్మగా భావించి పూజించడమేనని నిజామబాద్ ఎ౦పీ కవిత అన్నారు. శాంతి సరోవర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ వేడుకల ద్వారా ప్రజలందరిని ఒక్కతాటి పైకి తేగలిగామన్నారు. ప్రజల్లో ధైర్యం, ఉత్సాహం నింపి శాంతితో జీవనం సాగించేలా చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

మంచి సమాజ రూపకల్పనపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయడమే 'స్పిరిట్‌ ఆఫ్‌ లైఫ్‌' లక్ష్యమని శాంతి సరోవర్‌ డైరెక్టర్‌ కుల్‌దీప్‌ దీదీ పేర్కొన్నారు. బ్రహ్మకుమారీస్‌ సంస్థ, తెలంగాణ రాష్ట్ర ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్టాత్మకమైన 'స్పిరిట్‌ ఆఫ్‌ లైఫ్‌' కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. మహిళల్ని గౌరవించడం, ఆత్మహత్యల నివారణ, డ్రగ్స్, మద్యపానాన్ని విడనాడేలా చేయడం, ఒత్తిడిని జయించేలా చేయడం, అందరూ కలసి మెలసి ఉండేలా చేయడం ఈ ప్రచార లక్ష్యమని కుల్ దీప్ అన్నారు.





Untitled Document
Advertisements