40ఏళ్ల రాజకీయ జీవితంలో సంతృప్తి : సీఎం చంద్రబాబు

     Written by : smtv Desk | Mon, Nov 20, 2017, 02:55 PM

40ఏళ్ల రాజకీయ జీవితంలో సంతృప్తి : సీఎం చంద్రబాబు

అమరావతి, నవంబర్ 20 : శీతాకాల సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో హామీ నిధుల వినియోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరణ ఇచ్చారు. ‘ఉపాధి హామీ కింద రూ.16,572 కోట్లు ఖర్చుపెట్టి మరి, ఈ పథకం కింద పలు నిర్మాణాలు చేపట్టామన్నారు. రాబోయే రోజులలో గ్రామాల్లో ఇంకా 18వేల కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాల్సి ఉందని, అంతేకాకుండా నూటికి నూరు శాతం సిమెంట్‌ రహదారులు, పంచాయతీ భవనాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

అలాగే క్రీడా మైదానాలు కూడా అభివృద్ధి చేయాలని చంద్రబాబు అన్నారు. 2018 నవంబర్‌ నాటికి 30లక్షల ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, విభజన హామీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పటికీ కేంద్రం వాటిపై సానుకూలంగా ఉందన్నారు.

తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ నాలుగేళ్లలో పొందిన సంతృప్తి గతంలో ఎన్నడూ పొందలేదన్నారు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా అభివృద్ధి పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.





Untitled Document
Advertisements