పెళ్లి పీటలెక్కబోతున్న పాండ్యా

     Written by : smtv Desk | Mon, Nov 20, 2017, 04:45 PM

పెళ్లి పీటలెక్కబోతున్న పాండ్యా

ముంబై, నవంబర్ 20 : ముంబై ఆటగాడు, అల్ రౌండర్, హార్దిక్ పాండ్యా సోదరుడు, క్రునాల్ పాండ్యా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, సోదరులు ప్రస్తుతం ముంబై ఇండియాన్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. క్రునాల్ తన స్నేహితుడు ద్వారా పరిచయమైనా పంకురి శర్మను డిసెంబరు 27న ముంబయిలోని శాంట క్రూజ్‌ హోటల్‌లో కుటుంబసభ్యులు, అతికొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య వీరి పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని కృనాల్‌ స్వయంగా వెల్లడించాడు.

ఈ సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రునాల్ మాట్లాడుతూ... " రెండు సంవత్సరాల క్రితం నా స్నేహితుడి ద్వారా నాకు పరిచయమైంది. తర్వాత తరచూ కలుసుకునే వాళ్లం. ఈ క్రమంలో మా మధ్య ప్రేమ చిగురించింది. నాకు అన్ని విషయాల్లో తను మద్దతుగా నిలుస్తుంది. తనతో వివాహం చాల సంతోషంగా ఉందని" తెలిపాడు.







Untitled Document
Advertisements