పిల్లలు పుట్టిన తరువాత ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్!!!

     Written by : smtv Desk | Sun, May 24, 2020, 06:15 PM

పిల్లలు పుట్టిన తరువాత ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్!!!

అమ్మ అసలు ఏం తింటోందో ఎప్పుడైనా చూశామా మనం? మనందరికీ కావాల్సినవి చేసి పెట్టడంలో తనకవసరమైనవి తింటోందో లేదో పట్టించుకున్నామా? వయసుతో పాటూ రకరకాలా శారీరక మానసిక మార్పులు వస్తాయంటున్నారు ఆరోగ్య వరల్ద్ యొక్క మైథాలీ ప్రోగ్రాం లో న్యూట్రిషన్ కన్సల్టెంట్ గా ఉన్న డాక్టర్ మేఘనా పసి. ఆ మార్పుల్లో ఇవి కొన్ని

- శారీరకమైన చురుకుదనం, అరుగుదల, రోగ నిరోధక శక్తి తగ్గడం
- ఒబేసిటీ వల్ల వచ్చే మధుమేహం, గుండెజబ్బులూ, కాన్సర్ వంటివి
- గర్భధారణ, ప్రసవం, మెనోపాజ్
- వీటన్నింటి మూలంగా స్త్రీలకి ఎముకల్లో బలం తక్కువగా ఉంటుంది. అందుకని మెనోపాజ్ తరవాత ఆస్టియో పొరాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- శరీరంలో శక్తి తగ్గిపోతుంది.

ఈ లిస్ట్ చదువుతుంటే మీ మదర్ కి కూడా ఒకటో రెండో సమస్యలున్నాయని అనిపిస్తోంది కదా. సరైన వ్యాయామం, పోషకాహారంతో జీవితకాలాన్ని పెంచవచ్చని నిపుణులు అంటున్నారు. మీ మదర్ సరైన ఆహారం తీసుకునేలా చెయ్యాల్సిన బాధ్యత మీదే. ఇది లాంగ్-టర్మ్ లో చాలా ఉపయోగపడుతుంది అంటారు డాక్టర్ పసి.

- కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ని ఇచ్చే ధాన్యాలూ, పప్పులూ, పాలు మరియూ పాల పదార్ధాలూ, మాంసాహారం, కూరలు, పళ్ళూ ఆహారంలో భాగం కావాలి.

- బ్రేక్ఫాస్ట్ చెయ్యడం స్కిప్ చెయ్యకూడదు. పైగా వీలున్నంతవరకూ పొద్దున్న ఎనిమిది నించీ తొమ్మిదిలోపు చేసెయ్యడం మంచిది. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, ఉప్మా, పోహా, పరాథా, పళ్ళు ఏమైనా తినచ్చు.

- పదకొండింటికి గుప్పెడు నట్స్, ఒక పండు తినడం కంపల్సరీ.

- లంచ్ లో అన్నం/చపాతీ, సాలడ్స్, కూరలూ, పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలి. సీజనల్గా దొరికే పళ్ళూ, కూరగాయల్ని ఎప్పుడూ మిస్ చెయ్యకూడదు.

- సాయంత్రం టీ తో పాటూ పళ్ళు, వేరుశనగపప్పూ లాంటివి తీసుకోవాలి.

- రాత్రి భోజనం ఎనిమిదింటికల్లా అయిపోవాలి. కిచిడీ, పెరుగుతో కానీ, సూప్, పులావ్ తో గానీ తేలిగ్గా తీసుకోవాలి.

- రాత్రి నిద్రకి ముంది ఒక కప్పు గోరువెచ్చటి పాలలో కొంచెం పసుపు వేసుకుని తాగితే చక్కటి నిద్ర పట్టడమేకాకుండా రోగనిరోధకశక్తి కూడా బాగా పెరుగుతుంది.

- రోజుకి కనీసం రెండు - మూడు లీటర్ల నీళ్ళు తాగాలి. కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం లాంటివి కూడా మంచివే.

తినకూడని పదార్ధాలు:

రెడ్ మీట్, ప్రాసెస్డ్, పాకేజ్డ్ ఫుడ్స్, వేపుళ్ళు, స్వీట్స్, ఊరగాయలు, అప్పడాలు లాంటివి వీలైనంత తగ్గిస్తే మంచిది.

రోజూ ఆహారంలో ఉండాల్సినవి:

ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ - పప్పులూ, పాలు, సోయాబీన్స్, ఎగ్స్, గింజలు, లీన్ మీట్.
కాల్షియం రిచ్ ఫుడ్స్ - బాదాం, పాలు, పాల పదార్ధాలు, ఆకుకూరలు, పప్పులు, ఫిష్.
విటమిన్ డీ - పచ్చసొన, ఆకు కూరలు, సీఫుడ్, పాలు, విటమిన్ డీ సప్లిమెంట్స్.

వ్యాయామం చెయ్యడం, విటమిన్ డీ కోసం సూర్యరశ్మి సోకేటట్లు చూసుకోవడం చాలా అవసరం. యోగా చేయడం, ఏవైనా గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయడం చేస్తుండాలి.





Untitled Document
Advertisements